గడియారం 12 గంటలు కొట్టింది.
కాగితం చించి చెత్త బుట్టలో వేసా…
అదే ఆఖరి కాగితం…
నవ్వా,
నాతో పాటు ఇప్పుడే బయటపడ్డ
గోడమీది సున్నము పకపకా నవ్వింది.
“చచ్చావుపో ఇంతకాలానికి. చివరికి నేనే గెలిచా!”
కాస్త విజయ గర్వంతో అరిచా.
ఆమె మూలుగులు, లోగొంతుకతో ఏవో గుసగుసలు,
భారమైన నిట్టూర్పులు విడుస్తూనేఉంది.
నేను తల తిప్పి చూడలేదు…నాకేం జాలి కలగలేదు…
అబద్దాలు, అన్ని అబద్దాలు ఆమె చెప్పినవి.
ఇచ్చిన మాట ఎప్పుడు నిలుపుకుంది?
కాస్త ఓరగా చూసా… బొద్దింకలు, ఇంకా ఏవో పురుగులు
తనను తీరిక గా తినడం ప్రారంభించాయి.
అవును…ఇప్పుడు తను ముక్కలు, ముక్కలు అవుతోంది…
బాధతో మూలుగుతోంది… ఆఖరి ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
అయిపోయింది, ఆమె జీవితం ముగిసింది.
కొత్త కాలెండర్ తీసి చీలకు తగిలించి వెనుకకు తిరిగా.
“ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది!”
వెనుకనుంచి మెల్లగా గునిసింది.
కోపంతో నా ముఖం ఎర్రపడ్డది.
Also read: కర్మ ఫలం
Also read: నిశ్శబ్ద గీతిక
Also read: జ్ఞాపకాలు
Also read: నీకు దగ్గరగా
Also read: ప్రళయం
Also read: కూలి