• ట్రాక్టర్లలో ర్యాలీగా బయలుదేరిన రాజస్థాన్ రైతులు
• అడ్డుకున్న హర్యానా పోలీసులు
• వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ను ప్రయోగించిన పోలీసులు
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు వెళుతున్న రాజస్తాన్ రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాజస్థాన్ హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. 20 నుంచి 25 ట్రాక్టర్లలో ర్యాలీగా బయలుదేరిన రైతులు రేవారిలోకి ప్రవేశించారు. బుద్లా ఫైఓవర్ వద్ద రైతులు పోలీసులు అడ్డుకున్నారు. సరిహద్దుల్లో బారికేడ్లను తొలగించేందుకు రైతులు ప్రయత్నించారు. దీంతో హర్యానా పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లను ప్రయోగించి రైతులను చెల్లాచెదురు చేసేందుకు యత్నించారు. ఈ ప్రయత్నంలో కొందరు రైతులు సరిహద్దులు దాటి ఢిల్లీ వైపు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్ హర్యానా సరిహద్దుల నుంచి మరో 15 కిలో మీటర్లు ప్రయాణిస్తే ఢిల్లీ చేరుకుంటారు.
ఇది చదవండి: కేంద్ర మంత్రులతో రైతు నేతల చర్చలు బుధవారం
ఇది చదవండి: ఉధృతంగా కొనసాగుతున్న అన్నదాతల ఆందోళనలు