గుడిలో ఏముంది
దేవుడున్నాడు
సనాతన ధర్మం ఉంది
సాంప్రదాయం ఉంది
అపరిమితాన్ని పరిమితంలో చూపడం ఉంది
ఆలోచన లేకపోయినా ఆచరణ ఉంది
అవశ్యం పాటించాల్సిన ఆచారం ఉంది
దాని వెనుక బోలెడంత ఆరోగ్యం ఉంది
ఆలోచనను క్రమబద్ధం చేసే మార్గం ఉంది
దేవుడి మీద ప్రేమ ఉంది
భక్తి ఉంది, రక్తి ఉంది
తాదాత్మ్యత ఉంది
మితిమీరిన ఉన్మాదంకూడా ఉంది
ఆలోచించలేని మూఢత్వం ఉంది
దేవుడికి లంచాలిచ్చే మూర్ఖత్వం ఉంది పూజలు, వ్రతాలు చేస్తే
తీర్థాలలో మునిగితే పాపాలు
పోతాయనుకునే అమాయకత్వం ఉంది
అందుకే “భజ గోవిందం మూఢమతే” అన్నారు.
బడిలో ఏముంది
ఆటపాటలున్నాయ్
అక్షరాలు, అంకెలున్నాయ్
టీచర్లున్నారు, ఛీటర్లున్నారు
పద్యాలు వల్లె వేయిస్తారు
భూగోళాలు చూపిస్తారు
చరిత్రలు చెబుతారు
అంకెల గారడీలు చేస్తారు
శాస్త్రాలను అశాస్త్రీయం చేస్తారు
ఆలోచనకు తాళం వేసి
జ్ఞాపక శక్తికి టానిక్కులిస్తారు
అయినా పుట్టుకతో వచ్చిన తెలివికి
తార్కిక జ్ఞానం తోడవుతుంది
తీరైన ఆలోచనా శక్తి వస్తుంది
మంచి చెడు విచక్షణ తెలుస్తుంది
సమగ్ర వ్యక్తిత్వం ఎదుగుతుంది
అహం వదలి జనం గురించి పట్టిచుకోవడం జరుగుతుంది
జనం వదలి పరం గురించి ఆలోచించడం మొదలవుతుంది
ఇహ పరాలను సమన్వయం చేయడం ప్రారంభమవుతుంది
గురువున్నా లేకున్నా ప్రయాణం సాగుతుంది “శివోహం” దాకా.
Also read: ప్రియురాలికి ప్రేమలేఖ
Also read: మేతావులు
Also read: ఆత్మ బలం
Also read: మహర్షి
Also read: కిం కర్తవ్యం?