- టీకా పంపిణీకి విస్తృత ఏర్పాట్లు
- వ్యాక్సిన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
కరోనా టీకా పంపిణీకి తెలుగు రాష్ట్రాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలో 1213 వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తొలి దశలో 139 సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించనున్నారు. త్వరలోనే వ్యాక్సినేషన్ కేంద్రాలను 1200 కేంద్రాలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.15 లక్షల మందిని ప్రభుత్వ ప్రైవేటు హెల్త్ కేర్ వర్కర్స్ వివరాలను కొవిన్ యాప్ లో పొందుపరిచినట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఒక్కో వ్యాక్సినేషన్ కేంద్రంలో 30 మందికి చొప్పున 139 కేంద్రాలలో ఆరోగ్య సిబ్బందికి టీకా వేయనున్నారు. ప్రతివారంలో సోమ, మంగళ, గురు, శుక్రవారాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుందన ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఏపీలో వ్యాక్సినేషన్ కు ముమ్మర ఏర్పాట్లు:
ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ టీకా పంపిణీకి వైద్య ఆరోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3,87,983 మంది ప్రభుత్వ, ప్రైవేటు వైద్య ఆరోగ్య సిబ్బందికి తొలివిడతలో కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 1940 ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ప్రతి కేంద్రంలో వంద మందికి వ్యాక్సిన్ వేసేలా ప్రణాళిక రూపొందించారు.
వ్యాక్సిన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. వ్యాక్సిన్ కోసం వచ్చే సిబ్బందికి ముందుగానే కొ-విన్ యాప్ ద్వారా సమాచారం పంపారు. వ్యాక్సిన్ తీసుకునే వారు గుర్తింపు కార్డులు తీసుకురావాలని అధికారులు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే వ్యాక్సిన్ ప్రక్రియను కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి అవసరమైతే ప్రథమ చికిత్స అందించేందుకు ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద అత్యవసర వైద్య సిబ్బందిని నియమించారు
ఇదీ చదవండి:కరోనా టీకాల పంపిణీకి సర్వం సిద్ధం