తెలుగు అకాడమీ ప్రచురించవలసిన గొప్ప గ్రంథం ఆగిపోయింది.
ఎమ్.ఎన్. రాయ్ 1920 ప్రాంతాలలో సోవియట్ యూనియన్ లో లెనిన్ తో దీటుగా ఎదిగి, మారుతున్న భారతదేశం అనే గ్రంథం ప్రచురించారు. అది ఆనాడు లక్షలలో జనం అక్కడ కొన్నారు.
మళ్ళీ ఇన్నాళ్ళకు తెలుగులో అనువదించి వెలుగులోకి తెచ్చారు కీ.శే. ప్రొఫెసర్ డా. సి. నారాయణరెడ్డి సంపాదకులుగా, నరిసెట్టి ఇన్నయ్య అనువాదం చెయ్యగా, తెలుగు అకాడమీ ప్రచురణకు స్వీకరించింది. ఇది 1980 ప్రాంతాలలో జరిగింది. నారాయణరెడ్డికి, ఎన్. ఇన్నయ్యకు డబ్బు చెల్లించారు కూడా.
ఎందుకోగాని ఆ పుస్తకం ప్రచురించలేదు. ఈలోగా అకాడమీ చీలిపోయి, ఆంధ్ర విభాగం వెళ్ళిపోయింది. గ్రంథం ప్రచురించమని ఇన్నయ్య కోరుతూనే వున్నారు.
వెంటబడగా కొత్తగా వచ్చిన డైరెక్టర్ దేవసేన యీ విషయాన్ని డెప్యూటీ డైరెక్టర్ వెంకటేష్ ను చూడమన్నారు. వ్రాత ప్రతి ఎక్కడుందో తెలియదని, బహుశ పడేసి వుండొచ్చని, ఆయన్ను కలుసుకున్న వారికి చెప్పారు.
ప్రచురించే గ్రంథానికి ఎడిటర్ ఫీజు, అనువాదకుని ఫీజు చెల్లించిన అనంతరం ఇలా జరిగింది. ఇప్పుడు నారాయణరెడ్డి లేరు. ఇన్నయ్య అమెరికాలో ఉన్నారు.
అమూల్యమైన అనువాద ప్రతి పోగొట్టడం దేనికిందకు వస్తుంది? ఎవరు బాధ్యత వహించాలి ? ఎవరు చర్య తీసుకోవాలి ?