1 మాతృ భాష తల్లి లాంటిది అంటారు. పరాయి భాషలు సవతి తల్లి లాంటివి.
2 మాతృ భాష సహజంగా ప్రయత్నం లేకుండా వస్తుంది. వేరే భాషలు ప్రయత్నంతో నేర్చుకోవాలి.
3 మాతృ భాషలో వచ్చే వ్యవహారిక వాడకం మిగతా భాషలలో కూడా రావచ్చు. కాని సృజనాత్మకత మాతృ భాషలో వచ్చినట్లుగా మరో భాషలో రాదు.
4 నేడు మాతృ భాషలో ధైర్యంగా, స్పష్టంగా, తప్పులు లేకుండా మాట్లాడలేని దురదృష్టవంతులు చాలా మంది కనిపిస్తున్నారు.
5 ఆంగ్ల భాష మీద మోజు పెంచుకుని తెలుగును నిర్లక్ష్యం చేసి రెంటికీ చెడిన వారవుతున్నారు.
6 తెలుగు మాట్లాడేవాడు ప్రపంచం లోని ఏ భాషలోని శబ్దాలనైనా పలకగలడు.
7 వినడానికి ఇంపైన శబ్దాలతో శ్రావ్యమైన భాష తెలుగు.
8 అచ్చు అక్షరాలతో అంతమయ్యే ఇటాలియన్ భాషలా ‘ఉ’ కార అంతంతో మాధుర్యం నిండిన భాష తెలుగు.
9 తెలుగు శబ్దాలు పలికినపుడు మొహంలోని కండరాలాన్నిటికి కలిగే వ్యాయామంతో మొహానికి వన్నె తెచ్చే భాష మన తెలుగు భాష.
Also read: త్రిలింగ దేశంలో హత్య
Also read: మార్గదర్శి
Also read: బేరీజు
Also read: కశ్మీర్
Also read: గుడిపాటి వెంకట చలం