అచ్చ తెనుగు
సగానికి పైగా సంస్కృత పదాలతో
సంస్కరించబడి
అందంగా మారి
గ్రాంధిక, గ్రామ్యాలే కాక
సొగసైన శిష్ట వ్యవహారికంగా రూపు దిద్దుకుని
తెలుగుగా రెండు మాండలికాలతో
ప్రాంతానికొక రీతిగా
పట్టణానికొక తీరుగా
విలసిల్లిన తెలుగు భాష
కొన ఊపిరితో మూల్గుతోంది.
కళ్ళు, కల్లు ఒకటిగా పలికే నవతరం
తెలుగును గొంతు నులిమి చంపేస్తోంది.
తెనుగు “తేనె” అన్న రాయలు ఆత్మ క్షోభిస్తూంది.
రక్షించండి. జాతి ప్రతీకను కాపాడండి
స్వచ్ఛ ఆంద్రలో స్వచ్ఛ తెలుగును బతికించండి.
Also read: గోవిందా గోవింద
Also read: “వలస పక్షులు”