Saturday, December 21, 2024

హత్యాయత్నాన్ని మీరు సమర్థిస్తారా? : పువ్వాడ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పోలింగ్ సందర్భంగా  తనను చంపేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ్ అజయ్ తీవ్ర ఆరోపణ చేశారు. అయినా ఇలాంటి వాటికి తాను భయపడనని చెప్పారు.  బాచుపల్లిలోని తమ మెడికల్ కాలేజీకి వెళుతుండగా ఆ పార్టీ కార్యకర్తలు తన కారుపై దాడికి దిగారని, ఓటమి తప్పదన్న అసహనంతో ఈ దురాగతానికి పాల్పడ్డారని అన్నారు.  ఓటర్లకు పంచేందుకు తాను కారులో డబ్బు తరలిస్తున్నానన్న బీజేపీ మాటల్లో  వాస్తవం లేదని అన్నారు. తనకారు బ్యానెట్ పై  బీజేపీ కార్యకర్త ఒకరు ఉన్నా కారు ఆపకుండా వెళ్లినట్లు సీపీఐ నేత  నారాయణ అనడాన్ని పువ్వాడ ఖండించారు.  బీజేపీ కార్యకర్తలు తనపై చేసిన దాడిని ఆయన సమర్థిస్తున్నారా? అని  ప్రశ్నించారు.  బీజేపీ కార్యకర్త బ్యానెట్  పై ఉండగానే  అజయ్ కారు వేగంగా వెళ్లిందని,  ఒకవేళ ఆ కార్యకర్త కిందపడి చనిపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అని నారాయణ ప్రశ్నించడంపై మంత్రి స్పందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles