హైదరాబాద్: న్యాయవాదులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసును హైకోర్టు సూమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ హత్యోదంతం ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. జంట హత్యలపైన సత్వరం నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ‘‘లాయర్ల హత్య ప్రభుత్వంపట్ల ప్రజల విశ్వాసాన్ని ప్రశ్నించేదిగా ఉన్నది. తీవ్రంగా ఖండించదగిన సంఘటన. ఈ కేసులో నిందితులను త్వరగా పట్టుకోవాలి. సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలి. విశ్వాసాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి,’’ అంటూ హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను మార్చి ఒకటో తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
పోలీసు కమిషనర్ ని సస్పెండ్ చేయాలి
తెలంగాణ న్యాయస్థానాలలో న్యాయవాదులందరూ గురువారంనాడు విధులను బహిష్కరించారు. రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణను సస్పెండ్ చేయాలని హైకోర్టు లాయర్లు డిమాండ్ చేశారు. నాంపల్లి కోర్టులకు చెందిన న్యాయవాదులు రాజభవన్ కు ఊరేగింపుగా వెళ్ళి గవర్నర్ కు వినతిపత్రం సమర్పించాలని ప్రయత్నించారు. వీరిని సైఫాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి కోర్టులలో కూడా న్యాయవాదులు విధులను బహిష్కరించారు. సికిందరాబాద్, కూకట్ పల్లిలో కూడా న్యాయవాదులు విధులకు హాజరు కాలేదు.
ఇదీ చదవండి : పెద్దపల్లి జంటహత్యలపై హైకోర్టులో పిటిషన్
చోద్యం చూశారు
సాటి మనిషి రక్తపు మడుగులో కొట్టుకుంటున్నప్పటికీ జనం చోద్యం చూశారే కానీ ఆస్పత్రికి తరలించే ప్రయత్నించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. బస్సుల్లో ఉన్న జనం చోద్యం చూశారు. రోడ్డుమీద ఉన్నవారు కొంతమంది భయపడి దూరంగా జరిగారు. కొందరు సెల్ ఫోన్లతో చిత్రాలు తీశారు. చుట్టూ జనం ఉన్నప్పటికీ హంతకులు కత్తులతో, గొడ్డళ్ళతో వచ్చి హత్యచేసి పారిపోగలిగారు. ప్రజలు చూస్తూ ఉండగానే కారులో నుంచి వామనరావును బయటకు ఈడ్చుకొని వచ్చి కత్తులతో పొడిచి, గొడ్డళ్ళతో నరికివేస్తుంటే అడ్డుకున్నవారు ఎవ్వరూ లేకపోవడం దురదృష్టకరం.
ఇదీ చదవండి :న్యాయవాదుల హత్యకేసులో టీఆర్ఎస్ నాయకులపై అనుమానం
Hi there! This post couldn’t be written any better! Looking at this article reminds me of
my previous roommate! He always kept preaching
about this. I will forward this information to him. Pretty sure he’ll have a good read.
Many thanks for sharing!