హైదరాబాద్ : ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంలో పని చేస్తున్న మహిళలకు సోమవారం సెలవు మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కేసీఆర్ ఆదేశించారు.
మహిళలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, అభివృద్ధిలో మహిళలది కీలక పాత్ర అని ప్రశంసించారు. పురుషులతో అన్ని రంగాలలోనూ పోటీ పడుతున్న మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారని అన్నారు. జనాభాలో సగం ఉన్న మహిళలు అవకాశం ఇస్తే అద్భుతాలు చేయగలరనే విశ్వాసం వెలిబుచ్చారు.
Also Read : మహిళల చేతిలో కమండలం..
మహిళల రక్షణకోసం షీటీమ్స్ ఏర్పాటు చేశామనీ, వృద్ధ మహిళలకూ,ఒంటరి మహిళలకూ, వితంతువులకూ పింఛను ఏర్పాటు చేశామనీ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు పేదవారికోసం అమలు చేస్తున్నామనీ కేసీఆర్ వివరించారు. కేసీఆర్ కిట్ ఇస్తున్నామని చెప్పారు. అంగన్ వాడీ ఉద్యోగులకూ, ఆశా వర్కర్లకూ వేతనాలు పెంచామని కూడా కేసీఆర్ తెలియజేశారు.
Also Read : గృహిణులకు జీతాలు ఇవ్వాలి