- ఫిబ్రవరి 18న కేటీఆర్ ప్రమాణ స్వీకారం
- ముస్తాబవుతున్న భాగ్యనగరం
- భారీగా తరలిరానున్న పార్టీ శ్రేణులు
కేటీఆర్ పట్టాభిషేకానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. కేటీఆర్ పట్టాభిషేకం ఎప్పుడనే అంశం మీదే ఇప్పుడు రాజకీయా వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోందిపూజలు, యాగాలను నమ్మే కేసీఆర్ దీనిపై అద్భుతమైన ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆదేశాలతో ఫిబ్రవరి 18న ప్రమాణస్వీకారం చేసేందుకు వేద పండితులు ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ సీఎం అంటూ ఇటీవల ఆ పార్టీ నేతలు ముఖ్యంగా మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు అమితమైన బలాన్ని చేకూరుస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పగ్గాలు కుమారుడికి అప్పగిస్తారని గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి మార్పుపై ప్రచారం ఇటీవల ఊపందుకుంది.
కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే తేదీ కూడా ఖరారయినట్లు తెలుస్తోంది. దీనిపై జాతీయా మీడియా న్యూస్ 18 లో ఓ ప్రత్యేక కథనం కూడా ప్రచురితమయింది. ఫిబ్రవరి 18 న కేటీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని అందుకు కేసీఆర్ ముహుర్తం నిర్ణయించారని కథనం సారాంశం. దీనిపై అధికార పార్టీ నేతలు కూడా మౌనం వహించడంతో ఈ తేదీనే దాదాపు ఖరారయినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. కేటీఆర్ ప్రమాణ స్వీకారానికి పార్టీ కార్యకర్తలతో పాటు ఆయన స్నేహితులు కూడా భారీ సంఖ్యలో హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ప్రమాణ స్వీకార ముహుర్తంపై పలు జాగ్రత్తలు:
ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు కావడంతో ఆ మరునాడే అంటే ఫిబ్రవరి 18న రథసప్తమి కావడంతో ఆరోజున కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు తెలుస్తోంది. హిందూ సంప్రదాయంలో రథసప్తమికి చాలా ప్రత్యేకత ఉంది. సూర్యజయంతిగా, వైవస్వత మన్వాదిగా ప్రత్యేకత ఉంది. లోకానికి వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడి పుట్టినరోజుగా కూడా ప్రశస్తి. ఆరోజు చేపట్టే కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతాయని విశ్వాసం. అలాంటి దివ్వమైన రోజును కేటీఆర్ పట్టిభిషేకానికి ముహుర్తం ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఫిబ్రవరి 18 తో పాటు ఫిబ్రవరి 19 న రెండు రోజులు కూడా సప్తమి తిథి ఉంది. అయితే ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువగా ఉంది. ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ జయంతి రెండు కలిసి వచ్చేలా ఫిబ్రవరి 19న కూడా చేసే అవకాశం ఉంది. మొదట జనవరి 28న పౌర్ణమి సందర్భంగా ప్రమాణ స్వీకారం చేయాలని భావించినట్లు సమాచారం. ఆరోజు ముహూర్తం దాదాపు ఖాయమైందని అందవల్లే మంత్రులు ఒకరి తర్వాత ఒకరు కాబోయే సీఎం కేటీఆర్ అంటూ బహిరంగంగానే వ్యాఖ్యనించారు. అయితే దీనికంటే రథసప్తమి అయితే ఇంకా మంచి ముహూర్తం అని జ్యోతిష పండితులు చెప్పడంతో ఫిబ్రవరి లోనే ప్రమాణ స్వీకారం చేయించాలని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది.
రాజకీయ వారసత్వంలో టీడీపీ, కాంగ్రెస్ తప్పిదాలు :
అయితే కేటీఆర్ పట్టాభిషేకానికి కేసీఆర్ భారీ ఎత్తున కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అధినేతలు ఎదుర్కొన్న పరాభవాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ అధికార బదలాయింపుకు పూనుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం విషయంలో తనయుడు లోకేష్ పార్టీలో కీలకంగా మారాలనుకున్న చంద్రబాబు కలలు ఫలించలేదు. ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టినా అనుకున్న రీతిలో సక్సెస్ కాలేకపోయారని పలువురు అభిప్రాయపడ్డారు. వాక్యాతుర్యం, తెలుగు భాషపై పట్టు లేకపోవడం, కార్యకర్తలతో మమేకం కాలేకపోవడం లోకేష్ ను రాజకీయ చదరంగంలో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనావేశారు. ఈ పరిస్థితులలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉండే తీవ్ర పోటీ నేపథ్యంలో లోకేశ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళితే పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అపర చాణక్యుడైన చంద్రబాబు రాజకీయ వారసత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఇదీ చదవండి : కేటీఆర్ పట్టాభిషేకమా? కేసీఆర్ అస్త్ర సన్యాసమా?
కాంగ్రెస్ ఓటమిని శాసించిన నాయకత్వ లోపం:
వారసత్వం విషయంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా సరైన నాయకత్వంలేక దేశవ్యాప్తంగా దిగజారిపోయింది. యూపీఏ కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉంది. రెండు సార్లూ ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. కనీసం రెండోసారయినా రాహుల్ గాంధీని ప్రధానిగా చేసిఉంటే రాజకీయ పరంగా మంచి పాలనా సామర్థ్యం, ప్రతిపక్ష నేతగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చేవి. రాజకీయంగా అనుభవరాహిత్యం, పార్టీని నడిపేందుకు గత ఆరేడు ఏళ్లుగా ముఖం చాటేయడంతో కాంగ్రెస్ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. వరుస విజయాలతో అప్రతిహతంగా సాగిపోతున్న బీజేపీకి కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో కూడా కాంగ్రెస్ లేకపోవడం విశ్లేషకులను సైతం విస్మయ పరుస్తోంది. ఒకవేళ రాహుల్ ప్రధానిగా అయిఉంటే జాతీయ స్థాయి రాజకీయాలు ఖచ్చితంగా మరోలా ఉండేవి. మోడీ అమిత్ షాల వ్యూహాలే కంటే జాతీయ స్థాయిలో బలమైన ప్రత్యర్థి లేకపోవడమే బీజేపీ విజయాలకు ప్రధాన కారణమని రాజకీయ మేథావులు చెబుతున్నారు.
తరుముకొస్తున్న జమిలి ఎన్నికలు:
దేశంలోని ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల ఏకాభిప్రాయంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు వేగంగా ప్రణాళికాలు సిద్ధం చేస్తోంది. ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పలు మార్లు జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పలుమార్లు సూచనలు చేశారు. పార్టీ నేతలు విభేదాలు మరిచి ఐకమత్యంగా పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా జమిలి ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని అందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలను పలుమార్లు హెచ్చరికలు చేస్తున్నారు.
తొందరపడుతున్న కేసీఆర్:
తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ దూసుకొస్తోంది. పార్టీకి కేటీఆర్ లాంటి యువనాయకత్వం అవసరం ఎంతైనా ఉంది. పైగా అయితే కేటీఆర్ కు వాక్చాతుర్యంతో పాటు మంచి పాలనా అనుభవం కూడా తోడయింది. సోనియాగాంధీ, చంద్రబాబు లకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ ను సీఎంగా చేయాలని బాధ్యాయుతమైన తండ్రిగా రాజకీయ వారసత్వాన్ని కుమారుడికి బదలాయించడంద్వారా తన కర్తవ్యాన్ని పూర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీలో మంచి పట్టుకూడా ఉండటంతో తండ్రి కేసీఆర్ రాజకీయ వారసత్వాన్ని కేటీఆర్ ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేగలికే సామర్థ్యం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి:కేసీఆర్ కి మార్చి పిదప మహర్దశ?