- అక్బోబర్ లో ప్రొరోగ్ చేయలేదు కనుక గవర్నర్ ప్రసంగం ఉండదు
- మొదటిరోజే ఆర్థికమంత్రి హరీష్ రావు బడ్జెట్ సమర్పణ
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుండి ప్రారంభం కానున్నాయి. 2022-23 అర్ధిక సంవత్సర వార్శిక బడ్జెట్ ను అదే రోజు ఆర్ధిక మంత్రి హరీష్ రావు సభలో ప్రవేశ పెట్టనున్నారు.
రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయడం కోసం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మార్చి 7 తేదీ (సోమవారం) నుంచి రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. కాగా రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెల్పేందుకు మార్చి 6 వ తేదీ (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. సభ ఎన్నిరోజులు జరగాలనేది బిఎసి సమావేశంలో నిర్ణయిస్తారు. గత ఏడాది అక్టోబర్ 5 అసెంబ్లీ సమావేశాలు ప్రోరోగ్ చేయ్యకపోవడంతో (ఎడ్జర్నెడ్ సైనీ డై- నిరవధిక వాయిదా) ఈ సమావేశాల్లో గవర్నర్ ఉభయ సభలు ఉద్దేశించే ప్రసంగించే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో ఈ బడ్జెట్ సమావేశల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
ప్రగతిభవన్ లో రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేసేందుకు ఏర్పాటు అయిన సమావేశంలో లో ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహా అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ రామకృష్ణా రావు, సీఎంఓ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు