- ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2021-22 సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ను ఆమోదించేందుకు శాసనసభ, మండలి కొలువుదీరాయి. శాసన సభ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళసై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి అసెంబ్లీ సమావేశ మందిరంలో ప్రసంగించారు.తొలిరోజు కావడంతో సమావేశాలు గవర్నర్ ప్రసంగానికి మాత్రం పరిమితం కానున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల అజెండా ఖరారు చేసేందుకు రెండు సభల సభా వ్యవహారాల సలహా సంఘాలు సమావేశం కానున్నాయి. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం స్పీకర్ పోచారం అధ్యక్షతన బీఏసీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు.
Also Read:హైదరాబాద్ లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు
ఈసారి సమావేశాలు 15 రోజులపాటూ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు సోమవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం ఉంటుంది. 16న దివంగత ప్రజాప్రతినిధుల మృతికి ఇరు సభలు సంతాప తీర్మానం ప్రవేశపెడతాయి. అనంతరం సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. 17వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సభలో సభ్యులు ప్రసంగిస్తారు. ఈనెల 18వ తేదీన ఆర్థిక మంత్రి హరీష్ రావు ఉదయం 11.30 గంటలకు మంత్రి హరీష్ రావు బడ్జెట్‌పై ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. దానికి ముందు బడ్జెట్ ప్రతులను ఉభయ సభల సభ్యులకు అందజేస్తారు. బడ్జెట్ ప్రసంగం అయిపోయాక సభను వాయిదా వేస్తారు. బడ్జెట్ అధ్యయనం కోసం 19న సభకు సెలవు ప్రకటిస్తారు. ఇక 20వ తేదీ నుంచి సమావేశాలు యధావిధిగా మొదలవుతాయి.
దేశ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంధ్యం, కరోనా పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌ను వాస్తవ అంచనాలతో రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఉద్యోగులు, నిరుద్యోగులతో పాటు అన్న వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. పీఆర్సీ ప్రకటన, ఉద్యోగులకు జీతభత్యాల పెంపుపై నిర్ణయిం తీసుకునే అవకాశం ఉండటంతో రెవెన్యూ వ్యయం భారీగా పెరగనుంది. .
Also Read: యాదాద్రి ఆలయం పున:ప్రారంభంపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష