Friday, December 27, 2024

మూడో వారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

  • ఈ నెల 14న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ 
  • ఎన్నికల్లో నిమగ్నమైన ఎమ్మెల్యేలు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల మూడో వారంలో ప్రారంభంకానున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక ఉభయ సభలను సమావేశపరిచే అవకాశం ఉంది. నెలాఖరు వరకు సమావేశాలు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. పలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనల రూపకల్పనకు సంబంధించిన కసరత్తు దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేయాల్సిఉంది. ఈ నెలాఖరులో 2021-22 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ఉభయసభల ఆమోదం పొందాల్సిఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్  ఈ నెల 14న జరగనుంది. అనంతరం ఈ నెల మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకావాల్సిఉంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Also Read: షర్మిల కొత్త పార్టీపై ఏప్రిల్ 9 న ప్రకటన

ఎన్నికల్లో నిమగ్నమైన ప్రజాప్రతినిధులు :

ఎన్నికలు జరుగుతున్న జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ముఖ్యనేతలు ఎన్నికల బాధ్యతల్లో తలమునకలయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పూర్తిస్థాయిలో ఎన్నికలపై దృష్టి సారించడంతో ఎన్నికలు పూర్తయ్యాకే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. ఈ సంవత్సరం తొలిసారి సమావేశాలు జరుగుతున్నందున మొదటిరోజు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనారోగ్యంతో ఇటీవల మరణించిన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్శింహయ్యకు రెండో రోజు సభ సంతాపం తెలపనుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ప్రభుత్వం సమాధానం, సభలో బడ్జెట్ సమర్పించడం,  సాధారణ చర్చ, పద్దులపై చర్చ, ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం ఈ సారి సమావేశాల్లో చేపట్టనున్నారు.

Also Read: టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రంగ ప్రవేశం, బీజేపీలో కలవరం!

రెండు కాగ్ నివేదికలు:

కరోనా మహమ్మారి కారణంగా గట బడ్జెట్ సమావేశాలు అర్థంతరంగా ముగిశాయి. గత సంవత్సరం మార్చి 6 న ప్రారంభమైన సమావేశాలు 16 వ తేదీన ముగిశాయి. గవర్నర్ ప్రసంగంతో కలిపితే కేవలం  రోజులే సభ సమావేశమైంది. గత బడ్జెట్ సమావేశాలు మధ్యలోనే ముగియడంతో కాగ్ నివేదికను శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టలేదు. దీంతో ఈ సారి రెండు సంవత్సరాల కాగ్ నివేదికలు ఉభయ సభలలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles