సిర్పూర్ కాగజ్ నగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్ ) మానవత్వం లేని మానవ మృగం అంటూ బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ దూషించారు. సిర్పూర్ కాగజ్ నగర్ లో జరిగిన బహిరంగసభలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ తో పాటు పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. తనదైన శైలిలో ముఖ్యమంత్రి పైన దాడి చేశారు.
Also Read: ఇది కుమ్రం భీం పుట్టిన గడ్డ కేసీఆర్, జాగ్రత్త: తరుణ్ చుగ్ హెచ్చరిక
ఆయన కింది విధంగా మాట్లాడారు:
‘‘ పాల్వాయి పురుషోత్తం ఆశయాలు నెరవేర్చేందుకు హరీష్ బాబు బీజేపీలోకి వస్తున్నారు. బిజెపి అంటే కేసీఆర్ కు డప్పులు కొడుతున్నాయి.. కేసీఆర్ బాక్సులు బద్ధలవుతున్నయి. మీ ప్రజల పోరాటం ఫలితంగా సిర్పూర్ మిల్లు ప్రారంభించారు.. కానీ స్థానికులకు ఉద్యోగాలు రాలేదు…80 శాతం ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చారు.రెండు బర్రెలతో వచ్చిన వ్యక్తి, రెండువందల కోట్లు సంపాదించారు ఇక్కడ.
‘‘దుబ్బాక లో బిజెపి కొట్టిన దెబ్బకు కేసీఆర్ గూబ గుయ్యిమన్నది. తెలంగాణలో తెరాస గడీల పాలన, రాక్షస పాలన అంతమొందించాలంటే బీజేపీతోనే సాధ్యం. కేసీఆర్ కి ఎమ్మెల్సీ అంటే మాస్టర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్ అని అర్థం.‘‘35వేల కోట్లతో ప్రాణహిత ప్రాజెక్టు మొదలుపెడితే లక్షకోట్లతో దోచుకునే ప్రాజెక్టు గా మార్చిండు. కమిషన్ ల కోసం కక్కుర్తిపడి ప్రాజెక్ట్ ల పేరుతో మోసం చేస్తున్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ కడతామని ఓ తట్ట మట్టి కూడా తీయలేదు. మిషన్ భగీరథ పేరుతో కోట్లు దోచుకున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ తాగు నీరులేక ఇబ్బంది పడుతున్నారు. గిరిజనుల కోసం పోరాడి ప్రశ్నిస్టెంమా పై దాడి చేసి, అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారు..తెలంగాణలో రాక్షస రాజ్యం నడుస్తుంది. తెలంగాణ కోసం అమరుల త్యాగం చేస్తే వారి త్యాగాల రక్తపు మడుగులో తెరాస రాజ్యమేలుతోంది. తెలంగాణకు కాపలా కుక్కల ఉంటానన్న వ్యక్తి ఇవ్వాళ తెలంగాణకు విశ్వసఘాతకుడిగా మారాడు. సిర్పూర్ కాగజ్ నగర్ లో అభివృద్ధికి ఖర్చు చేసే ప్రతి పైసా కేంద్రం ఇచ్చే పైసానే.
Also Read: లాయర్ దంపతుల హత్యను సీరియస్ గా తీసుకొన్న పోలీసులు
వామనరావు హత్యకేసులో ఎందుకు స్పందించలేదు?
‘‘సిర్పూర్ అభివృద్ధి కోసం ఎంత నిధులు ఖర్చు చేశారో దమ్ముంటే శ్వేత పత్రం విడుదల చేయాలి. బిజెపి ఏ మతానికి వ్యతిరేకం కాదు. 80 శాతం ఉన్న హిందువుల కోసం పని చేస్తే, మతతత్వ పార్టీ అనే రంగు పూస్తున్నారు. 13వేల కంపెనీలు తెచ్చిన అని చెప్పుకునే వారికి నేను సవాల్ చేస్తున్న..ఆ 13 వేల కంపెనీల లిస్ట్ బయట పెట్టు…నేనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీకు ఓటేయ్యమని ప్రచారం చేస్తాం. న్యాయవాది వామన రావ్ దంపతుల జంట హత్యల కేసులో ఇంతవరకు స్పందించకపోవడం శోచనీయం..వెంటనే సీఎం స్పందించాలి. బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కోసం ఈ రాబోవు రెండు సంవత్సరాలు కష్టపడండి… మీ కోసం మేము కాపలాగా ఉంటాం. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరటం ఖాయం,’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.