నాగలి తీసి ఒసారి మళ్ళీ గోడకు ఆనించా.
సేలలో మట్టి రాల్లయి పోతుండాది.
నెర్రు లొచ్చి, నేలతల్లి అల్లాడతాంది.
పోవాలా… వద్దా…
చేలకు పోయి, సేసే దేముంది?
ఆకాసం లో దూరంగా
చార్మినార్ సిగరెట్ పొగలా
కూసంత మబ్బు..
“వస్తా దంటవ?!” వరాలు అడగతాంది.
“అది వరసమే, వరసమ్…అంటే నీల్లు, నీల్లు
ఊరకొస్తాదా? మనం పిలిస్తే వస్తదా?
పొమ్మంటే పోతదా…
దేవుడివ్వాల… మనకు రావాల!”
గట్టిగానే అరిసా…
వరాలు నవ్వతాంది…
“ఎం దేవుడోలే మామా…
అడిగితే ఇచ్చాడా?
ఎప్పుడుబడితే, అప్పుడు రావట్లే
…కన్నీల్లు!”
Also read: అమ్మ
Also read: నూతన జీవితం
Also read” ఎవరతను?!
Also read: ప్రయాణం
Also read: నడమంత్రపు సిరి