- గబ్బాలో గర్జించిన యువక్రికెటర్లు
ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా చరిత్ర సృష్టించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో ఘనవిజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ భారత్ కైవసం అయింది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండోసారి ట్రోఫీ గెలుచుకుంది. రెండో ఇన్సింగ్ లో ఆస్ట్రేలియా ఇచ్చిన 327 పరుగుల లక్ష్యాన్ని భారత్ 7 వికెట్లు కోల్పోయి ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. చివర్లో రిషభ్ పంత్, 138 బంతుల్లో 89 పరుగులు, వాషింగ్టన్ సుందర్ కీలక 22 పరుగులతో ఆడిన ఇన్నింగ్స్ తో జట్టుకు మరపురాని విజయాన్ని అందించారు.
ధోనీ రికార్డ్ బ్రేక్ చేసిన పంత్ :
ఇది చదవండి: గబ్బాలో కంగారూలకు సిరాజ్ దెబ్బ
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషభ్ పంత్ టెస్టు క్రికెట్ల లో ధోనీ రికార్డును బద్దలుకొట్టాడు. టెస్టుల్లో భారత వికెట్ కీపర్ గా అతితక్కువ ఇన్సింగ్స్ లో వేయి పరుగులు చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ రెండో ఇన్సింగ్స్ లో కెప్టెన్ అజింక్య రహానె ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పంత్ కమిన్స్ వేసిన ఓవర్ కు రెండు పరుగులు తీయడం ద్వారా ఈ ఫార్మాట్ లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. పంత్ కు ఇది 27 వ ఇన్సింగ్స్ కాగా మహేంద్ర సింగ్ ధోనీ 32 ఇన్సింగ్స్ లలో ఈ మైలురాయిని సాధించాడు.
టీమిండియాకు మోదీ ప్రశంసలు
టీమిండియా విజయం పట్ల ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. టీమిండియా సాధించిన చారిత్రక విజయానికి మోదీ అభినందనలు తెలిపారు. ట్విటర్ లో ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ విజయం అమితమైన ఆనందాన్ని ఇచ్చిందంటూ ఆటగాళ్లను పొగడ్తలతో ముంచెత్తారు.
ఇది చదవండి: బ్రిస్బేన్ టెస్టులో భారత్ భళా