* ఇంగ్లండ్ పై 4-1తో నెగ్గితే నంబర్ వన్ ర్యాంక్
* 3వ ర్యాంకులో రాహుల్, 6వ ర్యాంకులో కొహ్లీ
టెస్టు క్రికెట్లో నంబర్ వన్, వన్డే క్రికెట్లో నంబర్ టు ర్యాంక్ భారతజట్టును టీ-20 టాప్ ర్యాంక్ ఊరిస్తోంది. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు టీ-20 ర్యాంకింగ్స్ రెండోస్థానంలో కొనసాగుతోంది.
ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ ఇంగ్లండ్ కంటే 7 ర్యాంకింగ్ పాయింట్లతో వెనుకబడిన భారత్..అహ్మదాబాద్ వేదికగా జరిగే ఐదుమ్యాచ్ ల సిరీస్ లో 4-1తో ఇంగ్లండ్ పై నెగ్గితే టాప్ ర్యాంక్ కైవసం చేసుకోగలుగుతుంది.
న్యూజిలాండ్ తో ముగిసిన ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో 2-3తో పరాజయం పొందిన ఆస్ట్ర్రేలియా మూడో ర్యాంక్ కు పడిపోయింది. భారత్ కంటే ఆస్ట్ర్రేలియా ఒక్క పాయింటుతో మాత్రమే వెనుకబడి ఉంది.
Also Read : సమఉజ్జీల సమరానికి అంతా సిద్ధం
మూడో ర్యాంక్ లో రాహుల్
బ్యాట్స్ మన్ ర్యాంకింగ్స్ లో…ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్ టాప్ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. కంగారూ కెప్టెన్ ఆరోన్ ఫించ్ రెండు, భారత ఆటగాడు రాహుల్ మూడు ర్యాంకుల్లో నిలిచారు. భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ మాత్రం ఆరో ర్యాంక్ లో ఉన్నాడు.
ఇంగ్లండ్ కెప్టెన్ వోయిన్ మోర్గాన్ 10వ ర్యాంక్ లో ఉన్నాడు. న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ మూడుస్థానాల మేర తన ర్యాంక్ ను మెరుగుపరచుకొని 8వ ర్యాంక్ కు చేరాడు.
Also Read : టీ-20 సిరీస్ లో అతిపెద్ద సమరం
బౌలర్లలో రషీద్ ఖాన్ టాప్
బౌలర్ల ర్యాంకింగ్స్ లో భారత బౌలర్లు చోటు సంపాదించలేకపోయారు. అప్ఘనిస్థాన్ లెగ్ స్పిన్నర్ బౌలర్ల ర్యాంకింగ్స్ టాప్ ర్యాంక్ సాధించాడు. ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో సైతం…అఫ్ఘన్ ప్లేయర్ మహ్మద్ నబీ నంబర్ వన్ ర్యాంక్ సాధించడం విశేషం.
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ తో టీమ్, ఆటగాళ్ల వ్యక్తిగత ర్యాంకింగ్స్ తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు.
Also Read : భారత క్రికెట్లో ప్రతిభావంతుల అతివృష్టి