———-
(‘ TEACHING ‘ FROM ‘THE PROPHET’ BY KAHLIL GIBRAN )
తెలుగు సేత : డా.సి.బి. చంద్ర మోహన్
—————————————————-
ఒక ఉపాధ్యాయుడు ఆల్ ముస్తఫాను ఇలా అడిగాడు ” మాకు బోధన గురించి చెప్పండి.”
ఆయన చెప్పసాగాడు.
“మీ జ్ఞానోదయానికి పూర్వం
మీలో నిద్రాణలో ఉన్న
విషయాలకు మించి ఎక్కువగా
ఎవరూ ఏమీ చెప్పలేరు.
ఆలయం నీడలో
నడిచే గురువు, శిష్యులకు
తన జ్ఞానాన్ని పంచడు.
విశ్వాసాన్ని కలిగిస్తాడు.
ఇంకా – ప్రేమను కూడా పంచుతాడు.
ఆయన నిజంగా జ్ఞాని ఐతే
తన జ్ఞాన ప్రాసాదం లోకి మిమ్ములను ఆహ్వానించడు.
మీ బుద్ధి వాకిలిలోకి మిమ్మల్ని నడిపిస్తాడు!
ఖగోళ శాస్త్రజ్ఞుడు అంతరిక్షంపై
తన అవగాహన గురించి మాట్లాడగలడు
కానీ
తన అవగాహనను
సంపూర్ణంగా మీ కందించలేడు.
ఒక సంగీతకారుడు , విశ్వవ్యాప్తమైన
లయబద్ధ సంగీతాన్ని
మీకు వినిపించగలడు.
కానీ
ఆ లయను అందుకునే కర్ణాల నివ్వలేడు
ప్రతిధ్వనించే స్వరాన్నీ ఇవ్వలేడు!
గణితంలో ప్రజ్ఞావంతుడు
తూనికలూ, కొలతల గురించి చెప్పగలడు
కానీ
వాటి నిర్వహణ మాత్రం మీదే !
ఒక మనిషి తన దృష్టి రెక్కలని
మరొకరికి బదులివ్వలేడు
అంతర్యామి దృక్పధంలో — మీలో ప్రతి ఒక్కరూ
ఎలా ఒంటరిగా నిలబడతారో
అలాగే
అంతర్యామిని గురించిన అవగాహనలో
పృథ్విని ఆకళింపు చేసుకోవడంలో
ప్రతి ఒక్కరూ తమ ప్రత్యేకతను
నిలబెట్టుకోవాలి.
Also read: ఎర్ర మట్టి
Also read: వంతెన నిర్మాతలు
Also read: స్వీయ జ్ఞానం
Also read: తత్త్వ వేత్త మరియు చెప్పులు కుట్టేవాడు
Also read: కప్పలు