అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు కేడర్ అగ్రహం
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయలు వేగంగా మారుతున్నట్లు స్పష్టం అవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల ప్రశాంత్ కిషోర్ ప్రతిపక్ష నేత చంద్రబాబుతో భేటీ కావడం ఇటు టీడీపీ, అటు జనసేన పార్టీల్లో ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ప్రచారం చేయించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీ గడప తొక్కడం ఆశ్చర్యంగా ఉందని ఆయా పార్టీల నేతలు బోరుమంటున్నారు. చంద్రబాబు పీకేని ఎందుకు పిలిపించారు? పీకే వచ్చి పవన్ కళ్యాణ్ ని టీడీపీకి దూరం చేసే విధంగా ఉన్నారని ఇరు పార్టీ నేతలు కన్నెర చేస్తున్నారు. పీకే రావడం పట్ల ఇరు పార్టీలకు మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి ట్విస్ట్ లు ఏంటి అని పార్టీ వర్గాలు మదన పడుతున్నాయి. రాష్ట్రంలోని అవిభక్త 13 జిల్లాల్లో ఇరు పార్టీల మధ్య పీకే అగ్గి రాజేసారని పార్టీ ముఖ్య నేతలు మండిపడుతున్నారు.
2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో పార్టీల మధ్య పోరుకు సై అంటున్నాయి. ఒకవైపు వైఎస్ ఆర్ సీపీ మరొకవైపు ఉమ్మడిగా తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎన్నికలకు సమయాత్తం అవుతున్నాయి. పార్టీల కేడర్ లో అలజడి నెలకొంది. చంద్రబాబు కు అన్ని తెలిసే జరుగుతున్నాయా అన్న ప్రశ్నలకు బలం చేకూరుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు చంద్రబాబు పరిస్థితి ఉందని పార్టీ వర్గాలు అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.