- అరెస్టును ఖండించిన చంద్రబాబు
- రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమన్న బాబు
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై అధికారపక్షానికి చెందిన నేతలు నోటికి పనిచెప్పడంతో సామాన్యులు సైతం ఈసడించుకుంటున్నారు. చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవారు, మంత్రిస్థాయిలో హూందాగా వ్యవహరించాల్సిన వ్యక్తులు అసభ్య పదజాలంతో దూషణలకు దిగుతుండటంతో ప్రభుత్వ ప్రతిష్ఠ మంటగలిసిపోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కళా వెంకట్రావు అరెస్టుపై మండిపడ్డ చంద్రబాబు:
కళా వెంకట్రావు అరెస్టును టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు ఉన్మాది పాలనను తలపిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో డీజీపీ విఫలమయ్యారని ఆరోపించారు. తిరుపతిలో ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతిచ్చి ఎలా రద్దుచేస్తారని ప్రశ్నించారు. టీడీపీ నేతలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కళా వెంకట్రావును ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. కళా వెంకట్రావు అరెస్టుకు వైసీపీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
నాటకీయంగా కళా వెంకట్రావు అరెస్టు–విడుదల:
విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనలో జరిగిన నేపథ్యంలో మాజీ మంత్రి కళా వెంకట్రావును ను పోలీసులు నిన్న రాత్రి (జనవరి 20) అరెస్ట్ చేయడం వివాదానికి దారితీసింది. రామతీర్థం ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్లు, చెప్పులు విసిరారు. ఘటనలో విజయసాయిరెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు కళా వెంకట్రావును నిన్న రాత్రి (బుధవారం 20) 9 గంటల సమయంలో నెల్లిమర్ల పోలీసులు అరెస్టు చేసి చీపురుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టు సమయంలో అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. అయితే విచారణ అనంతరం రాత్రి 11.30 గంటలకు విడుదల చేశారు.
ఇది చదవండి: విజయవాడలో దేవినేని ఉమ అరెస్టు