Thursday, November 21, 2024

అనంత అభ్యర్థులపైటీడీపీ కసరత్తు

  • సామాజిక సమతుల్యం  కోసం అభ్యర్థుల మార్పు, చేర్పులు
  • కన్పించని జేసీ దివాకర్ రెడ్డి, అయన వారసులు
  • తాడిపత్రికి పరిమితమైన జేసీ ప్రభాకర్ రెడ్డి

మరో రెండు నెలల్లో  ఏపీ లో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల   సన్నాహాలకు కేంద్రం సిద్ధం అవుతోంది. దీంతో ఇటు సీఎం జగసన్మోహన్ రెడ్డి అటు  ప్రతిపక్ష నేత   చంద్రబాబు నాయుడు ఎన్నికల పోరుకుసై అంటున్నారు. మరొక వైపు బీజేపీ పొత్తులకు సిద్దమని చెబుతోంది. దీంతో జిల్లాలో ఎన్నికల సందడి నెలకొంది. రాబోవు ఎన్నికల్లో  ప్రచార అస్త్రాలు ఏమిటోనని రచ్చ బండ  వద్ద పల్లె జనం చర్చిచుకుంటున్నారు. అధికార, ప్రతిపక్ష నేతలు ఇద్దరు రాయలసీమకు చెందిన వ్యక్తులు  కావడంతో  సీమ జిల్లాల్లో తమ పట్టు సాధించడానికి అన్ని శక్తులను  ప్రయోగించడానికి సిద్ధం అవుతారు. టీడీపీ అధికార వ్యతిరేకతను నమ్ముకుంది. వైసీపీ మాత్రం తన నాలుగేళ్ళ పనితీరుపై విశ్వాసం పెంచుకుంది. ఇద్దరు  నేతలు మళ్ళీ జనం ముందుకు రాబోతున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో   ఎక్కువ మంది ఎమ్మెల్యే లను దక్కించుకోవడానికి  కొత్త ఎత్తులను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఈ ఎన్నికలు  సామాజిక సమతుల్యం పై చర్చలు జరుగుతున్నాయి. అనంత జిల్లాలో ప్రధానంగా జేసీ దివాకర్ రెడ్డి, పరిటాల రవి  జిల్లాను శాసించేవారు.  ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డి వయస్సు పైబడి రాజకీయాలకు దూరంగా వున్నారు. పరిటాల రవి ఆధిపత్యం పోరులో రాజకీయ హత్యకు గురైయ్యారు. తాడిపత్రిలో జేసీ ఏడు పర్యాయాలు ఎన్నికల్లో నెగ్గారు. దాదాపు 35 సంవత్సరాలు ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసారు. ప్రస్తుతం అనంత జిల్లాను ఒక తాటిపై తెచ్చే నేత కరువైయ్యారు. దీంతో ఎవరికివారు తమ సొంత నియోజక వర్గంకు  పరిమితం అయ్యారు. జిల్లాలో అభ్యర్థుల నియోజక వర్గాలపై పరిశీలిస్తే, నామినేషన్ ప్రక్రియ పూర్తి అయితే గెలుపు ఓటములు అంచనా వేయవచ్చు. ప్రస్తుతం తాడిపత్రి నియోజక వర్గంలో అధికార పార్టీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ అభ్యర్థి గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికల్లో తలపడతారు. అనంతపురం ఎమ్మెల్యే రేసులో ఇద్దరు వున్నారు. ఒకరు ప్రస్తుత ఎమ్మెల్యే అనంత్ వెంకటరామి రెడ్డి, బలిజ సామాజిక వర్గం మహాలక్ష్మి శ్రీనివాస్ అభ్యర్థుల జాబితాలో వున్నారు. మరోవైపు టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఎస్ఆర్  నిర్మాణ సంస్థ అధినేత  చౌదరి తో పాటు ముస్లీమ్ అభ్యర్థి వున్నారు. గుంతకల్ నుంచి అధికార పార్టీ వైసీపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, టీడీపీ మిత్రపక్ష  అభ్యర్థి గా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా  జనసేన  పార్టీ నుంచి ఎన్నికల బరిలో వుంటారని సమాచారం.  ఉరవకొండ నుంచి అక్కడ 2019లో పోటీ చేసిన వై. విశ్వేశ్వర రెడ్డి మళ్ళీ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ సీనియర్ నేత టీడీపీ నుంచి కేశవ్ చౌదరి పోటీలో వున్నారు.

రాయదుర్గం నియోజక వర్గం ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి ని మార్చి మెట్టు గోవింద్ రెడ్డి ని అభ్యర్థి గా వైసీపీ ప్రకటించింది. అక్కడ మాజీ టీడీపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు టీడీపీ టికెట్ ఆశిస్తున్నా పార్టీ నిరకరించింది. ఐతే కాల్వ కు హిందూపురం పార్లమెంట్ కు పంపాలని టీడీపీ అధిష్టానం యోచిస్తోంది. కళ్యాణదుర్గం నుంచి వైసీపీ నుంచి అనంతపురం పార్లమెంట్ సభ్యుడు తలారి రంగయ్య ను పోటీ కి దిపింది. అక్కడ టీడీపీ నుంచి ఉమామహేష్ నాయుడు తో పాటు వాల్మీకి సామజిక వర్గానికి చెందిన వ్యక్తిని టీడీపీ పరిశీలిస్తోంది. మడకశిర  నియోజక వర్గం ఎస్సీ రిజర్వడు. ఇక్కడ ప్రతి ఎన్నికల్లో అభ్యర్థి ని ఇరు పార్టీలు మార్చుతున్నారు. పుట్టపర్తి నుంచి పాత కాపులే ఇరు పార్టీ నేతలు పోటీ చేస్తున్నారు. కదిరి నియోజక వర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో ముస్లీమ్ అభ్యర్థి ని వైసీపీ కేటాయించింది. అక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే  ప్రసాద్ పోటీ లో వున్నారు. ధర్మవరం లో ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి ని వైసీపీ ప్రకటించింది. టీడీపీ నుంచి పరిటాల  శ్రీరామ్ ను టీడీపీ ప్రకటించింది. శింగనమల నియోజక వర్గం నుంచి  ప్రస్తుత ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి రానున్న అసెంబ్లీ కి టికెట్ నిరా కరించినట్లు  వైసీపీ  అధిష్టానం  చెబుతోంది. ఇక్కడ టీడీపీ నుంచి ఇద్దరు పోటీ కి ప్రయత్నం చేస్తున్నారు. ఒకరు మాజీ మంత్రి శైలజనాథ్, 2019 అసెంబ్లీ కి పోటీ చేసి ఓటమి చెందిన  మహిళ  బండారు శ్రావణి  మళ్ళీ పోటీకి సై అంటున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి పోటీకి శ్రీనివాసమూర్తి ప్రస్తుతం చిత్తూరులో డీఎస్పీగా పని చేస్తున్నారు. మరొకరు దినకర్. ఈయన డాక్టర్ గా వృత్తి చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే శమంతకమని కూతురు యామిని బాల,కొడుకు   అశోక్ టికెట్ ఆశిస్తున్నారు. కొంచం పాత రోజులు గుర్తు చేసుకుంటే అనంతపురం జిల్లా రాజకీయాలు పరిశీలిద్దాం.

అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో  అనంతపురం జిల్లా ముఠా కక్షలతో అట్టడుగుపోయాయిన సంఘటనలు ఇప్పటికి గుర్తు వస్తుంటాయి. పతాక స్థాయిలో జేసీ  దివాకర్ రెడ్డి పేరు వినిపించేది. బాంబుల మోతలు హత్యలు, ఆస్తులు ద్వంసం వంటి సంఘటనలతో రాజకీయ అలజడలు మారుమోగాయి.  టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో  ముఠా, కక్షలు, బాంబు సంస్కృతి, ఆధిపత్య పోరును జిల్లా ప్రజలు  తిరస్కరిస్తున్నారు.

C.S. Kulasekhar Reddy
C.S. Kulasekhar Reddy
కులశేఖర రెడ్డి 1992 నుంచి ఆంధ్రభూమి లో పనిచేశారు. వ్యవసాయం, నీటి పారుదల, విధ్యుత్ రంగాలపై పలు వ్యాసాలు రాసారు. అనంతపురం, చిత్తూరు, విజయవాడ, కడప, కర్నూల్, హైదరాబాద్ లలో 27 సంవత్సరాలు విలేఖరిగా పని చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles