- టిడిఎఫ్-మన తెలంగాణబడి కార్యక్రమంలో పూనిక
- ఐదువేల డాలర్ల సాయం అందించిన టీడీఎఫ్
పాఠశాల భవన నిర్మాణానికి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఐదు వేల డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ USA అధ్యక్షులు డాక్టర్ దివిష్ అనిరెడ్డితో పాటు నిధుల సేకరణకు సహకరించిన అప్పటి అధ్యక్షులు కవితా చెల్ల, మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.
బిల్డింగ్ మరమ్మత్తుల నిమిత్తం తాము మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డిని సంప్రదించడంతో వారు తక్షణమే స్పందించి తెలంగాణ డెవలప్మెంట్ ఫారం వారితో చర్చించి నిధులు సేకరించడం జరిగిందని అన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం మా విద్యా సంస్థకు సహకరించడంతో విద్యార్థులకు ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు.
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అమెరికా డాక్టర్ దివిష్ అని రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందిస్తూ భావిభారత పౌరులుగా తీర్చి దిద్దుతున్న శ్రీ సరస్వతి శిశు మందిర్ నిర్వాహకులను అభినందించారు. పాఠశాల నిర్వహకుల అభ్యర్థన మేరకు ప్రస్తుతం అందిస్తున్న 5000 డాలర్లకు తోడుగా మరో 5000 డాలర్లను అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
పూర్వ విద్యార్థులు కూడా సహకరించడాన్ని అభినందించారు. పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించి ఇటీవల ఏర్పాటు చేసిన లైబ్రరీని సందర్శించారు. అదేవిధంగా రానున్న రోజుల్లో విద్యార్థుల ఆసరాల్లో తీర్చేందుకు తమ ముందుంటామని హామీ ఇచ్చారు
విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మనబడి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని విద్యాలయాలలో సౌకర్యాలను మెరుగుపరుస్తున్నరని ముఖ్యఅతిథి మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి అన్నారు.
శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులకు బోధనతోపాటు క్రమశిక్షణను అలవరిస్తూ వారిలో మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు ఎంతో కృషి చేస్తుందని వారిని అభినందించారు. రానున్న రోజుల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న తనను సంప్రదించవచ్చని వారికి చెప్పారు .
కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా శ్రీ సరస్వతి శిశు మందిరం తీర్చిదిద్దుతున్నందుకు యాజమాన్యాన్ని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా కార్యదర్శి మట్ట రాజేశ్వర్ రెడ్డి అభినందించారు. అదేవిధంగా రానున్న రోజుల్లో స్కూల్ కి ఏ విధమైన సహకారాలు సహకారాలు అందించడానికి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని అన్నారు.
నూతన జాతీయ విద్యా విధానం 20-20 20 పాలసీపై నిరామయ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ పాటి నరేందర్ రెడ్డి అవగాహన కల్పించారు. రానున్న రోజుల్లో బోధనలో జరగనున్న మార్పులను అధ్యాపకులకు విద్యార్థులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫో రం USA అధ్యక్షులు డాక్టర్ దివిష్ అనిరెడ్డి, నిరామయ ఫౌండర్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, టీడీఎఫ్ ఇండియా విభాగం ప్రధాన కార్యదర్శి మట్ట రాజేశ్వర్ రెడ్డి, నాయకులు సురేందర్ రావు తదితరులు పాల్గొన్నారు