మంచిర్యాల : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)ని ఉద్దేశించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ కింది విధంగా వ్యాఖ్యలు చేశారు.‘‘ కేసీఆర్ మీ అరాచకంను సహించబోదు.బిజెపి ఒక తుఫాను..మీరంతా ఈ తుఫానులో కొట్టుకుపోతారు. ఇది కుమ్రంభీం జన్మభూమి…కుమ్రంభీం ఆదివాసుల కోసం చేసిన పోరాటం ఇప్పటికి కోనసాగుతోంది..అప్పుడు నిజాం తో పోరాడితే..ఇప్పుడు నిజం ఆలోచనలు గల టీఆరెస్ తో పోరాటం సాగుతోంది.
‘‘కేసీఆర్ తో చెబుతున్నాం.ఇది కుమ్రంభీం గడ్డ..ఇక్కడి మా ఆదివాసీలు బెదరరు.. మిమ్మల్ని తరుముతారు. గోదావరి నీళ్ళు కేసీఆర్ 7 స్టార్ ఫామ్ హౌస్ కి వెళ్తున్నాయి కానీ పేదవాడి ఇంటికి కాదు. కేసీఆర్ ప్రభుత్వం కేంద్రం ప్రతి ప్రాజెక్టు లో అడ్డంకిగా మారింది.
Also Read: కేసీఆర్ వ్యూహం లో పీవీ ఓటు బ్యాంక్…?
‘‘కేసీఆర్ ప్రజల్లో మీ పట్ల నమ్మకం పోయింది. మోదీ ప్రభుత్వం పై నమ్మకం పెరుగుతోంది. 10 కోట్ల మంది పేదవారికి మరుగుదొడ్లు, 40 కోట్ల మందికి బ్యాంకింగ్ సేవలు లాంటి ఎన్నో సేవలు ప్రధాని మోదీ ప్రవేశపెట్టారు. 80కోట్ల మంది పేద ప్రజలకు కరోనా సమయంలో రేషన్ అందించింది మోదీ ప్రభుత్వం. తెలంగాణ లో ప్రభుత్వం లేదు దోపిడిదారులు ఉన్నారు. ఇది క్యాబినెట్ కాదు దొంగల ముఠా. ప్రజలు దీన్ని పెకిలిస్తారు.
రాజకీయాల్లో ఒకటి ఒకటి రెండు కాదు పదకొండు అనేది తెలుసుకోవాలి.ఈ పోరాటం ఆదిలాబాద్ లో మొదలయ్యింది.కేసీఆర్ లంకను దహనం చేసిన రోజే ఈ పోరాటం ముగుస్తుంది. దాని కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఓ హనుమంతుడిలా పోరాడాలి.
Also Read: నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ?
ఈ సందర్భంగా సిర్పూర్ కాగజ్ నగర్ లో జరిగిన సభలో కాంగ్రెస్ నేత పాల్వాయి హరీష్ రావు తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరిపోయారు. ఇక పోరాటం ఆదిలాబాద్ లో మొదలయిందనీ, కేసీఆర్ లంకను దహనం చేసిన రోజే ఈ పోరాటం ముగుస్తుందనీ, దాని కోసం ప్రతి బీజేపీ కార్యకర్తా హనుమంతుడి వలె పోరాడాలనీ తరుణ్ చుగ్ పిలుపునిచ్చారు.