Sunday, December 22, 2024

భాషణ

Khalil Gibran రాసిన ‘Talking’ (The Prophet నుంచి) కు అనువాదం

తెలుగు : డా. సి.జి. చంద్రమోహన్

—————

ఆలోచనా స్రవంతి

ప్రశాంతతను మింగేస్తే

నువ్వు మాట్లాడతావు!

హృదయ ఏకాంతంలో

మనుగడ అసాధ్యమైతే

పెదవులను

ఆసరా చేసుకొంటావు!

శబ్దం ధ్యాస మళ్ళిస్తుందిగదా!

గొప్ప కాలక్షేపం కూడాను!

భాషణలో

భావధార తెగిపోతుంది!

ఆలోచన

ఒక

స్వేచ్ఛా విహంగం

పలుకుబడి బందిఖానాలో

అది రెక్కలు విప్పినా,

ఎగర లేదు!

ఏకాకితనాన్ని

అధిగమిస్తారు కొందరు!

ఒంటరితనంలో

శబ్దరాహిత్యత

నగ్నహృదయానని

వారికే

ఆవిష్కరిస్తుంది!

ఒకో సారి

అన్యాపదేశంగా,

అనాలోచితంగా

మాటల్లో, గొప్పనిజాలు

చెబుతారు కొంతమంది.

మరికొందరు

పారమార్థిక సత్యాలు

మనసులో మోసుకు

తిరుగుతారు!

కానీ, వెలువరించరు!

వారి హృదయాల్లో

ఆత్మ

నిశ్శబ్ద లయతో

నివాసముంటుంది!

యథాలాపంగా

నీ స్నేహితుణ్ణి

కలిస్తే

ఆత్మీయంగా మాట్లాడు!

నీ గొంతు లోపలి

స్వరం

అతని చెవి లోపలి

కర్ణానికి చేరనీ!

రంగు మరచినా, పాత్ర వికలమైనా గాని

గతంలో రుచి చూసిన

మధువు తీయదనం

జ్ఞప్తికి వచ్చినట్లు

నీ హృదయ ఔన్నత్యాన్ని

అతని ఆత్మ సదా

యాది చేసుకుంటుంది!

Also read: మనువు

Also read: స్నేహం

Also read: భయం

Also read: అంకురాలు

Also read: మెల్లగా … మృత్యు ముఖంలోకి

Khlali Gibran on Talking

You talk when you cease to be at peace with your thoughts;
And when you can no longer dwell in the solitude of your heart you live in your lips, and sound is a diversion and a pastime.

For thought is a bird of space, that in a cage of words may indeed unfold its wings but cannot fly.

There are those among you who seek the talkative through fear of being alone.
The silence of aloneness reveals to their eyes their naked selves and they would escape.
And there are those who talk, and without knowledge or forethought reveal a truth which they themselves do not understand.
And there are those who have the truth within them, but they tell it not in words.
In the bosom of such as these the spirit dwells in rhythmic silence.

When you meet your friend on the roadside or in the market place, let the spirit in you move your lips and direct your tongue.
Let the voice within your voice speak to the ear of his ear;
For his soul will keep the truth of your heart as the taste of the wine is remembered
When the colour is forgotten and the vessel is no more.

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles