బుధవారం నెల్లూరు ప్రెస్ క్లబ్ లో హేతువాదసంఘం ప్రెస్ మీట్ జరిగింది. హేతువాదసంఘం రాష్ట్రాధ్యక్షుడు నార్నెవెంకటసుబ్బయ్య మాట్లాడుతూ, గుడ్లూరు మండలం చేవూరు సాగుచెరువు సర్వే నంబరు 879 లో కోట్లాది రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూమిని రామదూత అని ఒక దొంగస్వామి అక్రమణనుండి స్వాదీనం కేసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరి ఆదేశాలిచ్చి సంవత్సరంన్నర అయినా అతీగతి లేదనీ, అధికారులు దున్నపోతు మీద వర్షం పడిన చందంగా వ్యవహరిస్తున్నారనీ పునరుద్ఘాటించారు.
‘‘దీన్ని బాధ్యతారాహిత్యం అనాలా, నిర్లక్షం అనాలా, చెయ్యకపోయినా వాళ్ళు ఏమిచేస్తారులే అనే అహంకారం అనాలా అర్థం కావటంలేదు. ఈవిషయాన్ని రెవిన్యూ మంత్రికి, ముఖ్యమంత్రికి తెలియపరచినా అధికారులలో ఎమాత్రం స్పందనలేదు. అదికారులకు ముఖ్యమంత్రి అన్నా రెవిన్యూ మంత్రి అన్నాలెక్కలేదా? ఏమిటీ పాలన?’’ అంటూ నార్నె వెంకటసుబ్బయ్య అడిగారు.
‘‘నెల్లూరు జిల్లా గుడ్లూరుమండలం చేవూరు సాగుచెరువు (గతంలో ప్రకాశంజిల్లా) సర్వేనంబరు 879 లోని కోట్లాది రూపాయల చెరువుపొరంబోకు భూమిని ఒక దొంగస్వామి ఆక్రమించి, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆభూమిమొత్తం తనదేననీ, ఇతరులెవ్వరికి హక్కులేదనీ, ఒక తప్పుడు అఫిడవిట్ ఇచ్చి 25 సంవత్సరాల నుండి రామదూత అశ్రమం ఏర్పాటుచేసుకుని, యాగాలు, యఙ్ఞాలు, వ్రతాలు అంటూ మోసంచేస్తూన్నాడు. ప్రభుత్వనికి ఎన్నిసార్లు పిర్యాదుచేసినా పట్టించుకున్నవాడు లేడు .
‘‘పదిసంవత్సరాలక్రితం లోకాయుక్తలో పిర్యాదు చెయ్యగా, చివరికి ప్రిన్సిపల్ సెక్రటరి ఉషారాణి గారు 28/5)2021 నాడు అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టరుకి అక్రమ భూమిని స్వాధీనం చేసుకొవాలని మెమో నంబరు 15358/Assn .111(2)/2014 deted 28/5/2021 నాడు ఆదేశాలిచ్చింది. సంవత్సరంన్నర గడచింది. అతీగతిలేదు. ఈవిషయాన్ని రెవిన్యూ మంత్రి గారికి 17/4/2022 , నాడు లెటర్ వ్రాశాను. ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ప్రిన్సిపల్ సెక్రటరి అదేశాలు అమలుపరచని తహశీల్ దార్, కలెక్టరు మీద చర్యలు తీసుకోమని లెటర్ వ్రాశాను. ప్రిన్సిపల్ సెక్రటరి అదేశాలు కలెక్టరు అమలుపరచలేదని ముఖ్యమంత్రికి వ్రాస్తే , ముఖ్యమంత్రి కార్యలయం వారు మరల కలెక్టరుకే చూడమని వ్రాస్తారు.
‘‘పలానవాళ్ళు దొంగలు అనివ్రాస్తే, ఆదొంగకే తిప్పి పంపి చూడమనటం, ఇదేమిటి? ముఖ్యమంత్రి కార్యాలయం వారు విచారించి న్యాయం జరిగేట్లు చూడాలి. ఇంతవరకు ప్రిన్సిపల్ సెక్రటరి అదేశాలు ఎందుకు అమలుకాలేదు? ఎవరు అడ్డుకుంటున్నారు? లోకయుక్త అన్నా అధికారులకు లెక్కలేదా? ముఖ్యమంత్రి ఈ విషయమై అలోచించి ప్రిన్సిపల్ సెక్రటరి అదేశాలు అమలు జరిగేవిధంగాను చర్యలుతీసుకుని దొంగలనుండి ప్రభుత్వ భూమిని కాపాడాలి. అలాగె ఇంతకాలం అదేశాలు అమలుజరపని అధికారులను సస్పెండ్ చెయ్యాలి. ఇలాచేసినట్లైతే రెండోవాడికి బుద్ధి వస్తుంది’’ అని వెంకటసుబ్బయ్య అన్నారు.
ఈసమావేశంలో ఇంకా సంఘరాష్ట్ర ఉపాద్యక్షుడు రాచపాళెం రఘు, జయ రాములు, రామయ్య తదితరులు పాల్గొన్నారు.