భగవద్గీత–93
ఒక సినిమా పాట ఈ మధ్య విన్నాను నెక్స్టేంటని. Always define next move. GOAL achieve చేయటానికి చెపుతుంటారు. అంటే ఒక పనిచేసి ఊరుకోకూడదు. తరువాత ఏం చేయాలో కూడా ఇప్పుడే ఆలోచించమంటాడు. అప్పుడే నీకు boredom అనేది ఉండదని చెపుతుంటారు. మనము లౌకిక జీవితంలో ఏదో ఒకటి సాధించి హాయిగా ఉండాలంటే ఇలానే ఒకదాని వెనుక ఒక పని చేసుకుంటూనే పోవాలి.
Also read: జ్ఞానంతో ఆలోచించి ఇష్టం వచ్చినట్టు చేయమని అర్జనుడికి కృష్ణుడి ఉద్బోధ
మరి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాను అని చెప్పేవాడికి ఈ విధంగా ఉండటం సరైనది అనిపించుకుంటుందా? ఆ విధంగా ఉండటం ఎన్నో బంధనాలకు దారితీస్తుంది. ఒకదాని తరువాత మరొకటి ఏదో ఒక కోరికతో చేసుకుంటూ పోతే అవి మనిషిని కట్టి పడవేస్తాయి. We will be caught in the web of desires.
మరి ఎలా బయటపడాలి!
జీవితం అనే పద్మవ్యూహంలో జొరబడ్డాం కానీ, బయటకురావడం తెలియని అభిమన్యులం మనం. పరమాత్మ ఒక solution చెప్పారు.
॥యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః॥
సమఃసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే॥
యదృచ్ఛము అనగా దానంతట అదే అంటే యాదృచ్ఛికముగా అంటామే అంటే accidentally (అనవచ్చునేమో). లాభ అనగా దొరికినది. సంతుష్టో సంతోషము చెంది అంటే తన దారిలో ఏదివస్తే దానితో సంతోషము చెందాలట. Whatever that comes in your way accept it అని చెపుతున్నారు పరమాత్మ.
Also read: ఆత్మజ్ఞానంతో పరబ్రహ్మస్వరూపం సాక్షాత్కారం
అలాగే ‘‘ద్వంద్వాతీత’’ అంటే ప్రపంచాన్ని రెండుగా చూడటం మానేసినవాడు. అనగా వానికి సుఖదుఃఖాలు, లాభనష్టాలు, తను-పరాయివాడు… ఇలాంటి భావనలన్నీ కోల్పోయినవాడు.
విమత్సరః! అంటే ఈర్ష్యలేనివాడు. నాకు రాలేదు పక్కవాడికి వచ్చినది అని ఎప్పుడూ కుళ్ళుకొని బాధపడటం ఈర్ష్య.
…ఈ ఈర్ష్య పోయినవాడు. ఇలాంటి వాడు ఏ విధమైన బంధనాలు లేకుండా హాయిగా ఉంటాడు.
ఇలా ఉంటే!
Conflict management, crisis management, Stress management వీటి అవసరాలే రావు. మనము ఆ స్థితి ఇప్పుడే చేరలేకపోవచ్చునేమో కానీ ప్రయత్నిస్తే తప్పులేదుగా.
Also read: భగవద్గీత అర్థమవుతే జీవితం అర్థం అవుతుంది