Sunday, December 22, 2024

అమెరికాలో యార్లగడ్డకు శస్త్ర చికిత్స

• విజయవంతంగా గుండెకు స్టంట్
• నిలకడగా ఆరోగ్యం

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ కు గుండె సంబంధిత శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. అమెరికాలోని తన కుమారుని వద్దకు వెళ్లిన యార్లగడ్డ అక్కడ తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. పరీక్షలు నిర్వహించి డాక్టర్లు గుండె కవాటాలు మూసుకుపోయినట్లు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేసి స్టంట్ అమర్చాలని వైద్యులు సూచించారు.

డాక్టర్ల సూచనమేరకు యార్టగడ్డ బాపిస్టు మెడికల్ సెంటర్ చేరారు. కొరనరీ యాంజియోప్లాస్టీ చికిత్సను ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా పూర్తి చేసారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రి నుంచి ఈ రోజు (జనవరి 29) డిశ్చార్జి కానున్నారు. వైద్యుల సూచన మేరకు కొంతకాలం అక్కడే ఉండి విశ్రాంతి తీసుకోనున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో యార్లగడ్డ ఇండియా చేరుకునే అవకాశం ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. యార్లగడ్డ ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ ఛైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles