(బండారు రాం ప్రసాద్ రావు)
రజినీ కాంత్ రాజకీయ రంగప్రవేశం తుస్సు మనిపించింది. ఆరోగ్య రీత్య కూతుళ్ళ సూచన మేరకు సొంత పార్టీ ఆలోచన విరమించకున్నట్టు చెబుతున్నపటికి దాని వెనుక పెద్ద రాజకీయ వ్యూహం దాగి ఉందా? నైతిక విలువలు దిగజారిన ఈ స్థితిలో డెబ్భై ఏళ్ళ సినిమా పరిశ్రమ ఇచ్చిన సూపర్ స్టార్ బిరుదు ను శాశ్వతంగా కాపాడుకునే లా ఉండడానికేనా? లేక స్వతహాగా కర్ణాటక వ్యక్తి అయిన రజినీ రేపటి నదీ జలాల చిక్కుల్లో తమిళ కర్ణాటక జల వివాదం లో చిక్కుకోవడం ఇష్టం లేకన? ఇంకా పోతే తన రాజకీయ చలనచిత్ర మిత్రుడు కమల్ హాసన్ పెడుతున్న పార్టీ వల్ల తన ఓటు బ్యాంక్ కు గండి పడి అత్తెసరు సీట్లు వస్తాయా అనే సంశయమా? ఇవన్నీ కాక బిజెపి భవిష్యత్ ఆశలు రజనీకి ఏమైనా కలిపించిందా? లేదా ఆంధ్రలో చిరంజీవి పార్టీ లాగా వైఫల్యం చెందుతుందా అనే బెంగ వల్ల రజనీ కాంత్ రక్తపోటు పెరిగి ఆసుపత్రి పాలయ్యారా? ఇన్ని ప్రశ్నల మధ్య సింపుల్ గా ఆయన పార్టీ నిర్ణయాన్ని పక్కన బెట్టి, అభిమానుల ఆశలపైన నీళ్ళు చల్లారు.
165 సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి, తమిళ ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం పొందిన రజినీ కాంత్ దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందారు… తమిళ నాడులో జయలలిత మరణించిన తరువాత జరిగిన రాజకీయ అస్థిరత తో రజనీ కాంత్ కు పార్టీ పెట్టాలనే ఆలోచన వచ్చింది… అంతకు ముందే కమల్ హాసన్ పార్టీ నిర్ణయాన్ని ప్రకటించి ఉండడం వల్ల తమిళ రాజకీయాల్లో మరో సారి చలన చిత్ర నటుల రాజకీయ పోరాటం చూస్తామని అభిమానులు ఆశలు పెంచుకున్నారు…అయితే కర్ణాటక తమిళనాడు నదీ జలాల వివాదం చిచ్చు రేపింది.
Also Read : రాజకీయాల్లోకి రావట్లేదు-రజనీకాంత్ ప్రకటన
కర్ణాటకలో పుట్టిన రజినీ కాంత్ పై కూడా ఈ ప్రభావం పడింది. సొంత రాష్ట్ర ప్రయోజనాలు కావాలో, బ్రతుకు తెరువు కోసం తమిళనాడు కు వెళ్ళిన వాళ్ళ ప్రయోజనాలు కావాలో తేల్చుకోవాలి అనే అల్టిమేటం రెండు రాష్ట్రాల నుండి అందుకున్నారు…కండక్టర్ గా జీవనం వెళ్ళబొస్తున్న రజనీ కాంత్ ను బాల చందర్ సూపర్ స్టార్ గా మర్చాడు ముప్ఫై ఏళ్ల అయన చలనచిత్ర జీవితంలో కోట్లు సంపాదించాడు…ఆ డబ్బును పేదల కోసం పంచడం మాట ఎలా ఉన్నా పార్టీ తరఫున పేదలను ఆదుకుని ఎన్టీఆర్ ఎం జీఆర్ స్థానాన్ని ఆక్రమించుకునెలా ఉండాలి అనుకున్న రజనీ కలలు.. ఈడేరడం కష్టం. పార్టీ ప్రకటించక ముందే రజనీకి రాజకీయ నక్షత్రాలు కళ్ళ ముందు కనబడ్డాయి…తన అత్యంత సన్నిహిత వర్గాల ను అక్కున చేర్చుకుని ఆరా తీస్తే ఆయనకు యాభై సీట్లు వచ్చే అవకాశం ఉందని తిరిగి ఎదో పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి వస్తే తన రాజకీయ అస్తిత్వమే దెబ్బ తినే ప్రమాదం ఉందని ఆయన నమ్మారు.
ఇవన్నీ ఆలోచించి పార్టీని పెట్టక పోవడమే శ్రేయస్కరమని భావించినట్టు తెలుస్తున్నది. తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ పార్టీ నాయకులను తిట్టకుండా, గతంలో సినీ గ్లామర్ తో తమిళ నాడు ను ఏలిన వారి నీ తిట్టకుండా, అసలు తోటి తన సినిమా సహచరు డైన కమల్ హాసన్ ను తిట్టకుండా రాజకీయాలు నడపడం అసాధ్యమైన పని! కానీ వీరందరినీ తిట్టకుండా కేవలం స్వఛ్చమైన తమిళ రాజకీయాలను నడపడం రజినీకాంత్ కు కాని పని. మణియన్ అనే రాజకీయ విశ్లేషకుడు రజనీ కాంత్ పార్టీకి సలహాదారుగా ఉన్నాడు.
ఈయనను సరికొత్త తమిళ శక్తిగా ఆవిర్భవించెలా చేయడానికి కంకణం కట్టుకున్నాడు. అయితే రోబో లాగా తలాడించే రాజకీయాలు కావు. ఆయన సృష్టించే రజనీ కాంత్ రాజకీయ నాయకుడిగా ఉండాలంటే పదునైన మాటలతో ప్రత్యర్థులను చిత్తు చేయాలి…కానీ ఏం జి ఆర్, జయలలిత, కరుణానిధి ఓటు బ్యాంక్ ను విచ్ఛిన్నం చేసే వాగ్ధాటి రజనీ కాంత్ కు ముమ్మాటికీ లేదు! అటు కావేరీ నదీ జాలలు, ఇటు తెలుగు గంగ జలాలు సున్నిత సమస్యగా ఉన్నాయి…పొరుగు రాష్ట్రాల్లో ఆయన సినిమాలు ఆడలంటే సఖ్యత అవసరం. ద్రావిడ పార్టీల గ్లామర్ చెక్కు చెదరలేదు. ఇలాంటి దశలో రజినీ కాంత్ పార్టీ పట్ల ఆసక్తి చూపే ఓటర్లు ఆయన ఊహించనంతగా లేరు.
Also Read : రజినీ సినిమా రద్దు
ఇక పోతే ప్రజలకు సహాయం చేసి ప్రజా జీవితంలో ఉండాలనుకుంటే మా పార్టీలోకి రమ్మని బిజెపి ఒక వైపు పిలుస్తోంది…భవిష్యత్ లో కేంద్రం లో బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే రజనీ కాంత్ కు అగ్రస్థానం కట్టబెట్టి…వివాదాలకు దూరంగా కేంద్రంలో పదవీ ఇవ్వడానికి కూడా మంతనాలు జరిగాయని అంటారు! ఈ దశలో తీవ్రంగా ఆలోచిస్తూ రక్త పోటు పెరిగి ఆసుపత్రి పాలైన రజనీ కాంత్ ఇక పార్టీ గురించి ఆలోచించకుండా ప్రజా సేవ గురించి ఆలోచిస్తూ విశ్రాంతి తీసుకోవడమే బెటర్ అని భావించి ఉంటారని రాజకీయ పండితులు అభిప్రాయ పడుతున్నారు.