Sunday, December 22, 2024

లిటిల్ మాస్టర్ 50 ఏళ్ల క్రికెట్ జీవితం

* దిగ్గజ క్రికెటర్ కు బీసీసీఐ సత్కారం
* వాంఖెడీ స్టేడియంలో సన్నీకి సొంత బాక్స్

భారత క్రికెట్ తొలి లిటిల్ మాస్టర్, ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనర్ సునీల్ గవాస్కర్ కొద్ది గంటల క్రితమే తన 50 సంవత్సరాల క్రికెట్ జీవితాన్ని పూర్తి చేసుకొన్నారు. 1971 మార్చి 6న కరీబియన్ గడ్డపై టెస్టు క్రికెట్ అరంగేట్రం చేసిన సునీల్ మనోహర గవాస్కర్ ప్రపంచమేటి ఓపెనర్లలో ఒకరుగా గుర్తింపు తెచ్చుకొన్నారు.

క్రికెట్ చరిత్రలోనే 10వేల పరుగుల మైలురాయి చేరిన టెస్టు తొలి ఓపెనర్ గా చరిత్ర సృష్టించిన సునీల్ మనోహర్ గవాస్కర్ క్రికెటర్ గా, క్రికెట్ వ్యాఖ్యాతగా యాభైసంవత్సరాల కెరియర్ ను పూర్తి చేయటంతో బీసీసీఐ ఘనంగా సత్కరించింది.

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో బీసీసీఐ కార్యదర్శి జే షా…గవాస్కర్ ను సత్కరించి..ఓ జ్ఞాపికను, ప్రత్యేకంగా తయారు చేసిన టోపీని అందచేశారు. భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య ముగిసిన నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ కు సునీల్ గవాస్కర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Sunil Gavaskar Felicitated By BCCI On 50th Anniversary Of Test Debut

Also Read : హైదరాబాద్ లో ఐపీఎల్ హుష్ కాకి.. ఐపీఎల్ -13కు కుదిరిన ముహూర్తం

ముంబై క్రికెట్ సంఘం అరుదైన కానుక

1971లో కరీబియన్ గడ్డపై వెస్టిండీస్ ప్రత్యర్థిగా 20 సంవత్సరాల వయసులో టెస్టు అరంగేట్రం చేసిన గవాస్కర్ ఆ తర్వాత అంతైఇంతై అన్నట్లుగా ఎదిగిపోయారు.

1970 దశకంలో భారత క్రికెట్ తొలి సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన 71 సంవత్సరాల గవాస్కర్ కు ముంబై క్రికెట్ సంఘం..వాంఖెడీ స్టేడియంలో జరిగే ఓ కార్యక్రమంలో ఓ సొంత బాక్స్ ను కానుకగా అందచేయనుంది.

1971 మార్చి 6న పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా తొలిటెస్టుమ్యాచ్ ఆడిన గవాస్కర్ తొలి ఇన్నింగ్స్ లో 65, రెండో ఇన్నింగ్స్ లో 67 నాటౌట్ స్కోర్లు సాధించారు. అంతేకాదు..సిరీస్ మొత్తంలో 774 పరుగులతో 154.80 సగటు సాధించి రికార్డుల మోత మోగించారు.

Sunil Gavaskar Felicitated By BCCI On 50th Anniversary Of Test Debut

Also Read : 100 వన్డేల క్లబ్ లో హర్మన్ ప్రీత్ కౌర్

టెస్టుల్లో 10 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గవాస్కర్ మాత్రమే. అంతేకాదు ఆయన 125 టెస్టులు ఆడి 34 సెంచ‌రీలు, 45 హాఫ్ సెంచ‌రీలు సైతం సాధించారు.

ముంబై, భారత క్రికెట్ కే గర్వకారణంగా నిలిచిన సునీల్ గవాస్కర్ రిటైర్మెంట్ తర్వాత చక్కటి క్రికెట్ వ్యాఖ్యాతగా స్థిరపడిపోయారు.

Sunil Gavaskar Felicitated By BCCI On 50th Anniversary Of Test Debut

Also Read : స్వదేశీ సిరీస్ ల్లో కెప్టెన్ కొహ్లీ రికార్డు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles