అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి తళుక్కుమన్నారు. న్యూయార్క్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుక ‘మెట్ గాలా-2021’లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో ఆమె మెరిశారు. ఈ ఏడాది థీమ్ ‘అమెరికన్ ఇండిపెండెన్స్’. భారతీయ ఫ్యాషన్ డిజైనర్లు ఫాల్గుని షేన్ పీకాక్ ఈ డ్రెస్‌ను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. దీని తయారీకి 250 గంటలు పట్టినట్లు డిజైనర్లు తెలిపారు. మెట్ గాలాలో సుధారెడ్డి పాల్గొనడం ఇదే తొలిసారి.
Also read: పోచంపల్లి చేనేత చీర పైన బెంగాల్ ఎంపీ ప్రశంసలు..
దయాగుణం, మానవత్వం మేళవించిన మహిళ సుధారెడ్డి సినిమా ప్రపంచానికి చెందకుండా ఫ్యాషన్ వేదికపైన పాల్గొన్న తొలి తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ. ఇదివరకు ఇటువంటి కార్యక్రమాలలో ప్రియాచోప్డా, దీపికా పడుకోన్, ఇషా అంబానీ, నటాషా పూనావాలా వంటి నటీమణులు పాల్గొన్నారు. ‘‘సొంత దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్పవిషయం. ఇది విశ్వవేదికపైన సాంస్కృతిక ప్రదర్శన. ఇండియాను సాంస్కృతికంగా ప్రపంచానికి పరిచయం చేయాలన్న సంకల్పంతోనే నేను ఫాల్గుని షేన్ పీకాక్ డిజైన్ చేసిన దుస్తులనూ, ఫరాఖాన్ నగలను ధరించాను. గత ఇరవై నాలుగు గంటలలో నాపైన కురిపించిన ప్రేమానురాగాలకు పులకించిపోయాను. అందుకు సంబంధించినవారందరికీ కృతజ్ఞతలు,’’ అని అవుట్ లుక్ మ్యాగజైన్ ప్రతినిధితో సుధారెడ్డి అన్నారు.
Also read: అక్టోబర్ 7నుండి ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు
‘‘ఇటువంటి ప్రతిష్ఠాత్మకమైన వేదికకు ఆహ్వానం అందుకోవడం అరుదైన అదృష్టం. ఇది గొప్ప అనుభూతి. మరువలేనిది. దేనితోనూ పోల్చలేనిది,‘‘ అని ఆమె అన్నారు. సుధాఫౌడేషన్ తెలంగాణలో లక్షలాదిమందికి సహాయం చేసింది. మెఘా గ్రూప్ పరిశ్రమలూ, ట్రూజెట్ ఎయిర్ లైన్స్ నిర్వహణలో తీరిక దొరికినప్పుడు వైద్యాన్నీ, విద్యనీ పేదలకు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానధర్మాలలో ప్రిన్స్ డయానా ఆమెకు ఆదర్శం. గోబల్ గిఫ్ట్ ఎంపవర్ మెంట్ ఆఫ్ విమెన్ అవార్డుకు నామినేట్ చేసిన ఒకే ఒక భారతీయురాలు సుధారెడ్డి. సుధ 12 నవంబర్ 1978న తెలంగాణలో జన్మించారు. ఆమె వయస్సు 42 ఏళ్ళు. ఆమె జీతం సంవత్సరానికి రూ. 24కోట్లు. తన పుట్టినరోజును దేశానికి అవతల ఏదైనా విదేశంలో జరుపుకోవడం ఆనవాయితీ. నలభయ్యో పుట్టినరోజు మాత్రం హైదరాబాద్ హైటెక్స్ లో దర్జాగా జరుపుకున్నారు. తన వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుతూ తెరవెనుకే ఉండాలని కోరుకునే సుధారెెడ్డి వాషింగ్టన్ లో విశ్వవేదిక మెట్ గాలా-2021లో పాల్గొని ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం విశేషం.
Also read: శంషాబాద్ విమానాశ్రయం విస్తరణకు తక్షణ చర్యలు : సింథియా