కాసారంలో కనువిప్పిన కలువవు నీవు
బురదగుంటలో బుడగతామర నేను
సకల జనుల లక్ష్యానివి నువ్వు
జన జడత్వాన్ని భరించలేని బడుగు కవిని నేను.
కలంనుండి జాలువారిందేదీ
ఎంగిలికూడు కాకూడదన్న తపన నాది
కవితా కన్యల అందాలు ఆరబోసిన కవుల ముందు
సిగ్గు మొగ్గలవుతూ మేలి ముసుగులో నువ్వు
నాకు సర్వ సమర్పణకు సిద్ధంగా.
Also read: చవటాయ్
Also read: బాగుపడాలంటే
Also read: గమ్యం
Also read: ఆకలి కేక
Also read: అరుణం