భగవద్గీత–97
అర్జున విషాదయోగము తరువాత సాంఖ్యయోగము ఎందుకు? అర్జునుడికి విషాదము కలిగింది. మరి ఆ విషాదము తొలగేదెట్లా?
మన ఇంట్లోనో లేక వృత్తిపరంగానో ఒక సమస్య మనలను బాధిస్తున్నదనుకోండి. అప్పుడు ఆ సమస్యకు సమాధానం ఎలా కనుగొనాలి? దాని మూలములోకి వెళ్ళి… సమస్య ఒక వటవృక్షములాగ పెరుగుతూ ఉంటే దానిని ఎక్కడ నరికితే ఆ సమస్య సమసిపోతుంది? దాని మూలంలోకి వెళ్ళి దాని వేర్లను నరికేస్తే సమస్య చచ్చిపోతుంది. ఇదే పద్ధతిని అనుసరించారు పరమాత్మ. విషాదయోగము అయిన వెంటనే సాంఖ్యయోగము.
Also read: భోగలాలసత దుఃఖకారకం
అనగా సమస్య మూలములోకి వెడుతున్నారు పరమాత్మ. మనిషేమిటి? వాడి మనస్సేమిటి? దానిలోకి భావాలు ఎలా ప్రవహిస్తాయి? ఎలా పుడతాయి? ఇంత సమగ్రమైన విచారణ చేస్తారు పరమాత్మ.
సాంఖ్యము అనగా?
సాంఖ్యము అనగా సంఖ్య కాలము. అనంతము. దానిని ఒక సంఖ్యతో సూచించగలమా? ఎక్కడ మొదలయి ఎక్కడ అంతమవుతుంది? మనకు వెనుక లెక్కకు అందనంత కాలము అయిపోయింది. లెక్కకు అందని కాలము ముందు ఉన్నది. This is pure scientific thought. సమ్యక్ జ్ఞానము సాంఖ్యము అని కొందరు అంటారు. అనగా ఏ విషయములోనైనా సంపూర్ణముగా జ్ఞానము సంపాదించటమే సాంఖ్యము అనబడుతుంది.
Also read: మనలను ఆవరించిన మాయ
Complete knowledge ఎలా వస్తుంది?
మూలములోకి వెళ్ళి తర్కిస్తే ఆ విషయానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుంది. ఉదాహరణకు: ఒక పండు మన ఎదురుగా ఉన్నది. దానిని చూడగానే అది ఏ పండని అడుగుతాము. మామిడి పండు అని సమాధానము. ఏ మామిడి అని అడిగితే? బంగినపల్లి, తోతాపురి, ఇమాంపసందు ఇలా ఏదో ఒక classified name లేదా శాస్త్రీయ నామమో చెపుతాము. ఇది ఎప్పుడు పంటకొస్తుంది? వేసవి కాలం. ఏ నేల suitable… ఇలా ప్రశ్నలు సంధించుకుంటూపోయి సమాధానాలు తెలుసుకుంటూ ఆ వస్తువు గురించి సమగ్ర జ్ఞానము సముపార్జించటమే సాంఖ్యము.
మన సమాజము, వర్ణాలు వీటన్నిటి గురించి ప్రశ్నించుకుంటూపోతే చివరకు ఎక్కడ తేలతాము… ఒకటే చోట. అదేమిటి అంటే… ఇదంతా పరమాత్మ సృష్టి అనే భావన దగ్గర. పరమాత్మ సృష్టి అయినప్పుడు ఇన్ని differences ఎందుకు?
మరల ప్రశ్నించుకుంటూపోతే అది మనసు చేసే మాయాజాలము అని తెలుస్తుంది. కాబట్టి మనస్సును streamline చేసుకోవాలని తెలుస్తుంది. మరల ఎలా streamline చేయాలి? దీనికి సమాధానము ధ్యానము.
ధ్యానము అనగా ధి-యానము. ధి అనగా బుద్ధి, యానము అనగా ప్రయాణము. బుద్ధి ఎలా ప్రయాణము చేస్తుంది? దాని స్వరూపము ఏమిటి? ఇలా ప్రశ్న వేసుకుంటూ సమాధానము వెతుక్కుంటూ వెడితే మనకు సాంఖ్య దర్శనమవుతుంది. పరమాత్మ సాంఖ్యయోగములో మనకు దానినే ఎరుక పరిచారు. This is a pure scientific thought.
ఆధునికులలో Carl Jung ప్రతిపాదించిన ANALYTICAL PSYCHOLOGY దీనికి చాలా దగ్గరగా ఉంటుంది. అది అభ్యాసము చేస్తే సమాజములోని అంతరాలుగా కనపడేవన్నీ రూపుమాసిపోతాయి.
Also read: భక్త సులభుడు భోళాశంకరుడు