విద్యలేనివాడు వింతపశువు అన్నారు
మనిషికి పశువుకు తేడా ఆలోచన
ఆలోచన పెపొందించేదే విద్య
ఆలోచనకు ఆధారం భాష
భాషలేనిది అనుభూతి ఉంటుంది
కానీ భాష లేని భావం ఉండదు.
పుట్టిన బిడ్డకు మొదటి మాట ‘అమ్మ’
తల్లిభాష అప్రయత్నంగా వస్తుంది
ఆ భాషలోనే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది
అమ్మ భాషలోనే పరిసరాల భాష అప్రయత్నంగా వచ్చేస్తుంది
పరిసరాల్లో లేని భాష ప్రయత్న పూర్వకంగా నేర్వాలి
అందుకు మాతృభాషలాంటి వాతావరణం కల్పించ నవసరం లేదు
కృత్రిమం ఎప్పుడూ సహజత్వానికి సాటిరాలేదు
విషయ అవగాహన మాతృభాషలోనే బాగు
సృజనాత్మకత మాతృభాషలో మెరుగు.
Also read: దేవాంతకులు
Also read: చూపు
Also read: భావదాస్యం
Also read: స్వేచ్చాజీవి