భారీ అంచనాలతో ఎట్టకేలకు విడుదలయ్యింది రణం, రౌద్రం, రుధిరం.
ఇద్దరు సూపర్ స్టార్స్ ,అదిరిపోయే విజువల్స్, టెక్నికల్ డిపార్ట్ మెంట్ పనితనం అడుగడుగునా కనిపిస్తుంది.
నాటు పాటకి డాన్స్ కంపోజింగ్ అద్భుతం. కొమురం భీముడో పాటకీ జూ.NTR భావోద్వేగ ప్రదర్శన అదరహో! ఇంటర్వేల్ కీ ముందు గూడ్స్ బండి యాక్సిడెంట్ ఘటన ప్రేక్షకులను అబ్బుర పరుస్తుంది.
ఐతే కధేంటి ?
ఈ ప్రశ్న సినిమా అయ్యాక ప్రేక్షకుడిని వెంటాడుతుంది.
కధ ఉందా అంటే ఉంది లేదు.
గోండు జాతి పిల్లని బ్రిటీష్ వాళ్ళు తీసుకుపోతే ఆ అమ్మాయిని విడిపించడానికి కొమురం భీమ్ బయలుదేరి అక్కడ ఆఫీసర్ గా ఉన్న రామరాజు తో తలపడతాడు. కధంతా ఇద్దరి చుట్టూ నడస్తుంది.
నాటు పాటలో దుమ్ము బాగా రేగింది కాని కధలో దమ్ము తగ్గింది.
చరణ్ ఎందుకు బ్రటీష్ సైన్యం లో చేరాడో ఇంటర్వేల్ తర్వాత తెలుస్తుంది.
బుల్లెట్లు వృధా చెయ్యకూడదని బ్రిటీష్ ప్రభుత్వం భావించడం విడ్డూరంగా ఉంది.
ఇంటర్వేల్ తర్వాత అజయ దేవగన్ చెక్క తుపాకులతో శిక్షణ, జూ.NTR సర్కస్ జంతువుల విన్యాసాలు, తాటి చెట్లు పడి పోవడం, బుల్లెట్లు ఎత్తడం లాంటి విన్యాసాలు నవ్వు తెప్పించి కామెడి లేని లోటు తీరుస్తాయి.
సాయి మాధవ్ కలానికి పెద్ద పని లేదు. ఆలియా భట్ మసూచికం వచ్చిందన్న సీన్ లో తప్ప మిగతా చోట అంత ప్రాముఖ్యత కనబడదు.ఎక్కడా ప్రేక్షకుడు లీనమయ్యే దృశ్యం కాని, మెలోడి సాంగ్స్ లేకపోవడం పెద్ద లోపం. ఇద్దరు హీరోలను బాలేన్స్ చేసే కసరత్తులో కధ గాడి తప్పింది.
ఒక పక్క అడవి లోనే చిన్నప్పటి నుండి పెరిగిన కొమురం భీమ్ విల్లంబులు వాడలేదా?
కోరడా సన్నివేశాలు 3డి ఎఫెక్ట్ లో ప్రేక్షకులను బాదుతున్నట్టే ఉంటుంది.
ఎత్తరా జెండా చివరలో రావడం ఎందుకో!
జాతీయ ఉద్యమ నేపధ్యం అని చెప్పినప్పుడు దాన్ని ఎందుకు ముట్టకోలేదో?
బలహీన మైన కధ కు VFX హంగుల తో సరిపెడదామనుకున్నారా?
వ్యాపార లెక్కలు సరిపోవచ్చు. మంచి సినిమా చూసిన అనుభూతి మిగలదు.
సమీక్ష : వీరేశ్వరరావు మూల