- పల్లా, కోదండరాం, చెరుకు సుధాకర్, రాణీరుద్రమ, నవీన్
- టీఆర్ఎస్ ప్రచారం షురూ
(శ్రీలత)
ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మేల్సీ ఎన్నికల కోలాహలం ఖమ్మం లో ఘనంగా మొదలైంది. ప్రదాన పార్టీల అభ్యర్దులు స్వతంత్ర అభ్యర్దులు ఎన్నికల బరిలో నిలిచి అదృష్టాన్ని పరిక్షీంచుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆరు నెలల ముందే ప్రదాన పార్టీల అభ్యర్దులు ఎన్నికల గోదాలో దిగారు.
అధికార టీఆర్ఎస్ నుండి ప్రస్తుత ఎమ్మేల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యర్దిత్వాన్ని పార్టీ అధినేత ప్రకటించనప్పటికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు పార్టీ శాసన సభ్యులతో కలిసి ఓటర్ల నమోదు కార్యక్రమంలో చురుకుగా పాలు పంచుకుంటున్నారు. అధికార పార్టీ టీవీ చానల్ ఇన్పుట్ ఎడిటర్ పి.వి.శ్రీనివాస్ తాను ఎన్నికల బరిలో ఉంటానంటూ ఖమ్మంలో వివిధ రాకీయ కార్యక్రమాలు నిర్వహించడంతో అధికార పార్టీ అభ్యర్ది ఎవరనే చర్చ పార్టీలో నడుస్తుంది.
నవ తెలంగాణ పార్టీ ప్రదాన కార్యదర్శి పలు టీవిల్లో ప్రయోక్తగా వ్యవహించిన రాణి రుద్రమ దేవి ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు మార్నింగ్ వాకర్లను కలిసి ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేసి ముందు వరసలో నిలిచారు.
మరో వైపు తెలంగాణ జన సమితి నుండి ఆ పార్టీ అధ్యక్షుడు ప్రో. కోదండరాం ఎన్నికల గోదాలో దిగుతానంటూ కాంగ్రేస్, వామ పక్ష పార్టీల మద్దతు కూడ గట్టే ప్రయత్నం ముమ్మరం చేస్తున్నారు. ఇంటి పార్టీ అధ్యక్షుడు డా. చెరుకు సుధాకర్ సైతం పట్టభద్రుల ఎమ్మేల్సీ ఎన్నికల్లో పోటీకి సమాయత్తం అయ్యారు.
వామపక్షాల తరుపున జర్నలిస్టు విజసారధిని రంగంలోకి దింపుతున్నారు. స్వతంత్ర అభ్యర్దిగా ఓ టీవి చానల్లో ప్రయోక్తగా పని చేస్తున్న (తీన్మార్ మల్లన్న) చింతపండు నవీన్ కుమార్ పోటీలో ఉండే అవకాశం ఉంది. ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉండటంతో ఓటర్ల ను తమ వైపు తిప్పుకునేందుకు అస్త్ర్ర శస్త్ర్రాలతో అభ్యర్దులూ, పార్టీలూ సమాయత్తం కావడంతో పట్టభద్రుల ఎన్నికల కోలాహనికి తెర లేచింది.