- రాజపక్స అజేయంగా 71పరుగులు
- రాణించిన శ్రీలంక బౌలర్లు
ఆసియా కప్ ఫైనల్ లో శ్రీలంక పాకిస్తాన్ ని ఓడించింది. 23 పరుగులతో విజయం సాధించి ఆసియాకప్ ను గెలుచుకున్నది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి, శ్రీలంకను బ్యాటింగ్ చేయమని కోరింది. మొదట్లో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ శ్రీలంక బ్యాటర్లు తట్టుకొని నిలబడి 170 పరుగులు చేశారు. భానుక రాజపక్స 45 బంతులలో 71 పరుగులు చేసి అజేయుడిగా నిలిచాడు. పాకిస్తాన్ బౌలర్ హరిస్ రౌస్ మూడు వికెట్లు తీసుకున్నాడు.
పాకిస్తాన్ 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. వికెట్లు వరుసగా కోల్పోయింది. ఇద్దరు ఓపెనర్లలో జట్టు నాయకుడు బాబర్ ఆజం అయిదు పరుగులు చేసి అవుటైనాడు. రెండో వైపు దిగిన వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ నిలకడగా ఆడి 55 పరుగులు సాధించాడు. గౌరవ ప్రదమైన పరుగులు సాధించి మరో పాకిస్తాన్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ 31 బంతులలో 32 పరుగులు చేశాడు. 147 పరుగులు మాత్రమే పాకిస్తాన్ జట్టు చేయగలిగింది. శుక్రవారం జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో సైతం పాకిస్తాన్ పైన శ్రీలంక జట్టు గెలుపొందడం విశేషం.