- చీకటివీడి వెలుగులోకి కేరళ ఎక్స్ ప్రెస్
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురై గత ఏడేళ్లుగా అఙ్జాతంలో గడిపిన భారత మాజీ ఫాస్ట్ బౌలర్, కేరళ ఎక్స్ ప్రెస్ శ్రీశాంత్ తిరిగి క్రికెట్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టాడు.
Also Read : ఆఖరిటెస్టుకు బుమ్రా, విహారీ దూరం
ముంబై వేదికగా జరుగుతున్నసయ్యద్ ముస్తాక్ అలీ క్రికెట్ టోర్నీలో కేరళజట్టులో సభ్యుడిగా పునరాగమనం చేశాడు. పాండిచ్చేరీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో శ్రీశాంత్ తన కోటా 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు. పాండిచ్చేరీ ఆటగాడు ఫాబిద్ అహ్మద్ ను తన ట్రేడ్ మార్క్ అవుట్ స్వింగర్ తో శ్రీశాంత్ పడగొట్టాడు.
ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా ఆడిన శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆటకు దూరమయ్యాడు. తనపైన విధించిన నిషేధం అన్యాయమంటూ న్యాయపోరాటం చేసి చివరకు సఫలమయ్యాడు. కోర్టు ఆదేశాల మేరకు శ్రీశాంత్ పై విధించిన నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేయడంతో తిరిగి క్రికెట్ కెరియర్ ను ప్రారంభించాడు.
Also Read : టెస్టు క్రికెట్లో రికార్డుల రిషభ్
గతంలో భారత ఓపెనింగ్ బౌలర్ గా ఎన్నోవికెట్లు పడగొట్టిన శ్రీశాంత్ 2007 టీ-20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారతజట్టులో సభ్యుడు కూడా.
భారత్ తరపున పలు వన్డేలు, టీ-20 మ్యాచ్ లు, టెస్టు మ్యాచ్ లు ఆడిన శ్రీశాంత్ ఏడుసంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగాడు. తన తొలి ఓవర్లో 9 పరుగులిచ్చిన శ్రీశాంత్..ఆ తర్వాతి ఓవర్లో పూర్తిస్థాయిలో బౌల్ చేసి పాండిచ్చేరీ ఓపెనర్ ను పెవీలియన్ దారి పట్టించాడు. పునరాగమనం మ్యాచ్ లోనే తనకు వికెట్ దక్కడం పట్ల శ్రీశాంత్ సంతృప్తి వ్యక్తం చేశాడు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తన క్రికెట్ జీవితంలో ఇది మరో ఆరంభమని ప్రకటించాడు.
Also Read : నేలవిడిచి సాములో భారత్ సరికొత్త రికార్డు