• అనూహ్య నిర్ణయం ప్రకటించిన బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్
• బీజేపీ విజయంపై ధీమా వ్యక్తం చేసిన శ్రీధరన్
దక్షిణాదిన పుదుచ్చేరి, తమిళనాడు, కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఈ సారైనా ఉత్తరాది పార్టీ అనే అపప్రదను చెరిపేసుకోవాలని భావిస్తోంది. పుదుచ్చేరి, తమిళనాడుల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్నారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లు ఉండటంతో పొత్తుకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో ఒంటరిగానే బరిలో దిగాలని ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఇటీవలే పార్టీ లో చేరిన మెట్రోమ్యాన్ శ్రీధరన్ కున్న క్లీన్ ఇమేజ్ తో ప్రజల్లోకి వెళ్లేందుకు యోచిస్తోంది.
Also Read: వార్థక్యంలో రాజకీయం శ్రీధరన్ కీ, బీజేపీకి నష్టంలేని ప్రయోగమే
ఈ నేపథ్యంలో కేరళలో సత్తా చాటేందుకు ఉవ్విళ్ళూరుతున్నబీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రో శ్రీధరన్ ని గురువారం (మార్చి 4) ప్రకటించింది. మెట్రో శ్రీధరన్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని కేరళ బీజేపీ అధ్యక్షుడు కే. సురేంద్రన్ అధికారికంగా ప్రకటించారు. మెట్రోమ్యాన్ శ్రీధరన్ ఇటీవలే బీజేపీలో అధికారికంగా చేరారు. శ్రీధరన్‌కున్న క్లీన్ ఇమేజ్ ఎన్నికల్లో లాభిస్తుందని బీజేపీ భావిస్తోంది. తిరువళ్లాలో విజయ్ యాత్ర నిర్వహిస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ సీఎం అభ్యర్థిని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను త్వరలో విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు.