వచ్చింది వసంతం
మావిళ్లు పూశాయి
కోయిల గొంతు సవరించుకుంది
షడృచుల యుగాది పచ్చడితో
నవయుగం ఆరంభం
పంచాంగ శ్రవణం
కవితా పఠనం మామూలే.
కవులకు వసంత శోభ కనుపిస్తుంది
వేసవి ప్రారభంలోనే రాలుతున్న పిట్టలు
విద్యుత్ లేమితో ఆగే పరిశ్రమలు
బడుగు జీవుల చెమట ధారలు
అడుగంటిన బావులు చెరువులు
నీటి కోసం జరిగే యుధ్ధాలు
పార్టీల పేర్లతో కుర్చీల కోసం
దేశానికి వెన్నుపోటు పొడుస్తున్న
రాజకీయుల అరాచకాలు
వాక్చాతుర్యంతో వారిని రక్షించే మేతావులు
జనంపై, సంస్కృతిపై జరుగుతున్న కుట్రలు
ఇవేవీ కుక్కపిల్ల, అగ్గిపుల్ల విలువ చెయ్యవు మనకు.
వెన్నెల, మబ్బులు, లేళ్లు, సెలయేళ్ళు
ప్రియురాలి మేని సుగంధాల లాంటివే
కవితలకు అర్హాలు.
అందమంటే ఛ్చందమని
ఙానమంటే వ్యాకరణమని
భావ అతీత భాషా ధ్యానంలో మునిగి
పోతున్నాం
సమాజం, మంచి గురించి రాయడం
అరసికత, అఙానం అంటున్నాం.
రుషుల వారసత్వం మనది
త్రికాల వేదులైన మన పూర్వులు
అన్నింటిలో మంచిని కూరి
కావ్యాలుగా నిలిపారు
వారి భాషా సాంప్రదాయాల్ని పట్టుకుని
వారి భావనల నుండి
మనం ఎంత దూరమయ్యామో.
అందంతో పాటు అన్నమూ అవసరమేగా.
భాషతో పాటు భావాన్నీ ఆస్వాదిద్దాం
మంచికంటే అందమైనదేదీ లేదని గుర్తుంచుకుందాం
సమగ్రత్వం జీవితంలోకి తెచ్చుకుందాం
యుగాది సాక్షిగా మానవత్వంతో బ్రతుకుదాం
అదే నిజమైన వసంతం
వసంత కవితోత్సవం.
Also read: కామ దహనం
Also read: సమత
Also read: అప్పుడు
Also read: లీలాకృష్ణ
Also read:: వందనం
Good aspiration