- స్పైస్ జెట్ విమానంపై సోనూసూద్ ఫొటో
- ప్రశంసలు కురిపించిన కాజల్
సోనూ సూద్ పేరు లాక్‌డౌన్‌లో దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. స్వస్థలాలకు వెళ్లలేక వలస కార్మికులు పడుతున్న కష్టాలను చూసి సొంత డబ్బులతో వారిని సొంత ఊళ్లకు పంపించారు. బస్సులు, రైళ్లు, విమానాల్లో ఇళ్లకు పంపించి మానవత్వం చాటుకున్నారు. ఆ తర్వాత కూడా ఎంతో మంది పేదలు, రైతులు, విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. స్పైస్‌జెట్ నుంచి లభించిన ఈ గౌరవం పట్ల సోనూసూద్ సంతోషం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్నవారికి తాను ఎప్పటికీ సాయం చేస్తూనే ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు.
బాలీవుడ్ నటుడు సోనుసూద్‌కు దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ అరుదైన గౌరవం అందించింది. లాక్‌డౌన్ సమయంలో ఆయన చేసిన విశేషమైన సేవలకు గౌరవంగా స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూసూద్ ఫొటో వేశారు. ఆపద్బాంధవుడు సోనూసూద్‌కు సెల్యూట్ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే తొలిసారి.
Also Read: ఏడాదిలోగా టోల్ ప్లాజాలకు స్వస్తి
లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది వలస కార్మికులను తమ స్వగ్రామాలకు పంపించేందుకు సోనూ ప్రత్యేకంగా స్పైస్‌జెట్‌తో కలిసి 2.5 లక్షల మంది భారతీయులను స్వస్థలాలకు చేర్చారు. అంతేకాకుండా విదేశాల్లో చిక్కుకున్న 1500 మంది భారతీయ విద్యార్థులను స్వదేశం తీసుకొచ్చారు. దీనికి సంబంధించి స్పైస్ జెట్ ఓ వీడియోను కూడా ట్విటర్ లో పోస్టో చేసింది. ఇలా ఎన్నో విధాలుగా సోనూ చేసిన సేవల పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ట్విటర్ లో ప్రశంసల వర్షం కురిపించారు.
సంతోషం వ్యక్తం చేసిన కాజల్ :
సోనూకు దక్కిన గౌరవం పట్ల నటి కాజల్ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన సేవల్ని కొనియాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు.
Also Read: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి