పండుగల వేళ ప్రయాణికులకు శుభవార్త
వోలేటి దివాకర్
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్ డివిజన్లలోని అత్యధిక సెక్షన్లలో రైళ్ల సర్వీసులను గంటకు గరిష్టంగా 130 కిమీల వేగంతో నడపడానికి అనుమతులు లభించాయి. దీంతో రైళ్ల వేగంలో జోన్ మరో మైలురాయిని అధిగమించింది. ఈ సెక్షన్లలో వేగవంతంగా ఒక క్రమపద్ధతి ప్రకారం చర్యలు తీసుకుంటూ, ట్రాక్‌లను పటిష్టపరిచి, మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ పలు చర్యలు తీసుకోవడంతో జోన్ ఈ లక్ష్యాన్ని సాధించింది.
Also read: అధికార పార్టీలో అంతా ఆసమర్థులేనా?
2020 సంవత్సరంలో 130కిలోమీటర్ల వేగానికి అనుమతులు మంజూరు చేశాక మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు, నిర్వహణ పనులు, సిగ్నలింగ్ సంబంధిత పనులు నిరంతరం నిర్వహించబడ్డాయి. ఈ సెక్షన్లలో అభివృద్ధి పనులు విస్తృతంగా చేపట్టాక రైళ్ల సర్వీసులను 12 సెప్టెంబర్ 2022 తేదీ నుండి గంటకు 110 కిమీల నుండి 130 కిమీల వేగంతో నడపడానికి ఇప్పుడు అనుమతులు ఇవ్వబడ్డాయి.
Also read: ఉండవల్లికి ఊరట…రామోజీకి చుక్కెదురు!
సరుకు రవాణా వేగం కూడా హెచ్చింపు
గరిష్ట వేగం అనుమతులు లభించిన ఫలితంగా ప్రయాణికుల రైళ్లతో పాటు సరుకు రవాణా రైళ్ల సగటు వేగం కూడా పెరుగుతుంది. ఇది రైళ్ల సమయపాలనపై సానుకూలమైన ప్రభావం చూపుతుంది. ప్రధానంగా, గరిష్ట వేగం అనుమతితో ముఖ్యమైన మరియు రద్దీ అయిన ఈ ప్రాంతాలలో సెక్షనల్ సామర్థం పెరుగుతుంది.
Also read: సెల్ ఫోన్ లో డబ్బు పంపినట్టు… పితృదేవతలకు ఆహారం పంపవచ్చు!
విజయవాడ-విశాఖ మధ్య మినహాయింపు
సికింద్రాబాద్ డివిజన్‌లోని సికింద్రాబాద్ `కాజీపేట్`బల్లార్ష, కాజీపేట్` కొండపల్లి సెక్షన్లు, విజయవాడ డివిజన్‌లోని కొండపల్లి`విజయవాడ `గూడూరు, గుంతకల్ డివిజన్‌లోని రేణిగుంట`గుంతకల్`వాడి సెక్షన్లు. దక్షిణ మధ్య రైల్వేలో ఈ సెక్షన్లు మొత్తం రద్దీగా ఉంటాయి, అయితే విజయవాడ, దువ్వాడ మధ్య సెక్షన్‌ను మినహాయించబడినది. ఇక్కడ వేగం పెంపుకు సంబంధించిన పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.