బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన ఛాతీనొప్పి రావడంతో కోల్ కతాలోని ఉడ్ ల్యాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఛాతీ నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. గంగూలీ అస్వస్థతకు గురయ్యారన్న వార్త తెలియగానే అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
నిలకడగా గంగూలీ ఆరోగ్యం
ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. అయితే ఆయనకు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంది అన్నారు. పరీక్షల అనంతరం యాంజియోప్లాస్టీ అవసరమా లేదా స్టంట్ వేయాలా వద్దా అనేది పరిశీలిస్తున్నట్లు గంగూలీకి చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.
త్వరగా కోలుకోవాలని ట్వీట్లు
గంగూలీ అస్వస్థతకు గురవడంతో క్రీడారంగాలకు చెందిన ప్రముఖులతో పాటు సినీ రాజకీయ రంగాలకు చెందినవారు గంగూలీ త్వరగా కోలుకోవాలని ట్విటర్లో ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గంగూలీ త్వరగా కోలుకోవాలంటూ ట్విట్ చేశారు.
ఇదీ చదవండి:ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా