- సౌరవ్ గంగూలీకి మరో రెండు స్టెంట్లు
భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నాలుగువారాల వ్యవధిలో ఆస్పత్రి నుంచి రెండోసారి డిశ్చార్జి అయ్యారు.
ఈ నెల ఆరంభంలో తొలిసారిగా గుండెనొప్పికి గురైన సౌరవ్ కు యాంజియోప్లాస్టీ ద్వారా స్టెంట్ ను అమర్చి కోలుకొన్న తర్వాత ఇంటికి పంపారు. అయితే…స్టెంట్ వేయించుకొన్న రెండువారాల వ్యవధిలోనే .. ఛాతీలో అసౌకర్యంగా అనిపించడంతో కోల్ కతాలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. పరీక్షల అనంతరం ఫలితాలను విశ్లేషించిన వైద్య బృందం మరో రెండు స్టెంట్లు వేసింది. గతంలో యాంజియోప్లాస్టీ నిర్వహించిన సమయంలోనే ధమనుల్లో మూడు చోట్ల పూడికలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు.. ఒక్క స్టెంట్ మాత్రమే వేశారు. ఆరోగ్య పరిస్థితిని బట్టి మిగిలిన రెండు స్టెంట్లు తర్వాత వేయాలని నిర్ణయించగా.. ఇప్పుడు మరోసారి ఛాతీలో అసౌకర్యంగా ఉండటంతో ఆ రెండింటిని వేశారు.
Also Read : పళని ఆలయంలో నటరాజన్
48 సంవత్సరాల గంగూలీకి విఖ్యాత కార్డియాలజిస్టులు డాక్టర్ దేవీ శెట్టి, డాక్టర్ అశ్విన్ మెహతా ఆధ్వర్యంలో స్టెంట్లు వేశారు. ‘గంగూలీ గుండె రక్తనాళాల్లో పూడికలు తొలగించామనీ, ఆయన కొద్దిమాసాలపాటు ఇంటిపట్టునే ఉండి మందులు వాడుతూ విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు వైద్యులు తెలిపారు.
Also Read : సునీల్ గవాస్కర్ కు అరుదైన కానుక
భారత ఓపెనర్ గా, కెప్టెన్ గా అసమానసేవలు అందించిన సౌరవ్ గంగూలీ తన కెరియర్ ను పూర్తి ఫిట్ నెస్ తో కొనసాగించారు. రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ వ్యాఖ్యాతగా, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడుగా,కార్యదర్శిగా సేవలు అందించడం ద్వారా బీసీసీఐ అధ్యక్షుడు స్థాయికి ఎదిగారు.
Also Read : బీసీసీఐ కార్యదర్శికి అరుదైన గౌరవం
కేవలం జనవరి నెలలోనే గుండెనొప్పితో రెండుసార్లు ఆస్పత్రిపాలై..మూడుస్టెంట్లు వేయించుకొన్న సౌరవ్ గంగూలీకి భార్య డోనా,కుమార్తె సనా ఉన్నారు.
Also Read : దేశవాళీ టీ-20 లో టైటిల్ సమరం