కొందరు అంతే!
వదిలించుకోలేము, విదిలించుక పోలేము
మనకన్నా వేరు అని అనుకోలేము.
కళ్ళ ముందు పరచుకొన్న వెన్నెల జలతారులా,
నీరెండ వెచ్చదనంలా,
గుండెలో పదే పదే గుచ్చుకొనే
అమృతం పులిమిన పూల కత్తిలా,
తీయని బాధ కలిగిస్తూనే ఉంటారు.
వారినే కాబోలు
స్నేహితులంటారు!
Also read: రాజకీయం
Also read: ద్వంద్వాలు
Also read: కాలం
Also read: ఇజం
Also read: మరపు