సింహం కడుపు నిండితే చంపదు
ఆవు అతిగా తిని బొజ్జ పెంచదు
పాము భయం కలగకపోతే కాటెయ్యదు
పక్షి రేపటి కోసం దాచదు.
మనిషికి మాత్రం అంతులేని ఆశ
మోసం, ద్వేషం, కుట్ర చేసైనా
తరతరాలకు సరిపడా కూడ బెడతాడు
ఒళ్ళు గుల్ల అయినా సంపాదన మానడు.
అతిగా తింటే అనారోగ్యమని తెలిసినా
చెడి బడి తినడం మానడు
కోరి రోగాలు తెచ్చుకొని రొష్టు పడతాడు.
ఎంత సంపాదించినా ఇంకా కావాలంటాడు
మునిమనవల కోసం కూడా దాచిపెడతాడు
తనవాళ్ళు కూడా సంపాదించుకోగలరన్న
ఆలోచన మనసులోకి రానివ్వడు.
అడవిలో జంతువులకున్న భద్రతా భావం
కాంక్రీటు గోడల మధ్య కూడా పొందలేడు
డబ్బే భద్రతగా భావిస్తాడు.
పూజలు, జపాలు చేస్తాడు
దేవుళ్ళకు లంచాలిస్తాడు
పక్కవాడి కష్టాన్ని మాత్రం పట్టించుకోడు
పూని కష్టాన్ని కలగ జేస్తాడు
జంతువులకు లేని ఆలోచన ఉన్నా
వాటికంటే హీనంగా ప్రవర్తిoచే మనిషి
గొప్ప వాడంటే అవి నవ్వుకుంటున్నాయి
రెండు కాళ్ళ ఈ సామాజిక జంతువును చూసి.
Also read: “దీపావళి”
Also read: “సింధువు”
Also read: “ప్రపంచ విద్యార్థుల రోజు”
Also read: పేదరిక నిర్మూలన దినోత్సవం
Also read: “హంతకులు”