Thursday, November 21, 2024

మణిపూర్

యత్ర నార్యస్తు అబద్దమేనా?

కుకీ ల పై కీచక పర్వమే నిజమా?

వేల దుశ్శాసనుల స్వైర విహారం నిజమా?

రక్షకులే తక్షకులైన దుర్దినం!

చట్ట ప్రకారమే ఎప్పటికో శిక్ష పడుతుంది

హస్తిన ఏ ప్రకటన లేకుండా మౌనవ్రతం దాలుస్తుంది

ఏ మూకలు రెచ్చిపోయినా నారీ యాగం తప్పదా?

అంధుడైన ధృత రాష్ట్రుడు

బధిరుడవడం కలి కాల ధర్మం!

విలువల వలువలు వలిచిన నేతలు ఏ

అసురులకు ప్రతినిధులు?

ఇంతులందరూ ద్రౌపదులుగా మారడం

ద్రౌపది ముర్ము సాక్షి గా నిజం!

రాజు గారు దేవతా వస్త్రాలు ధరించారు

నిజం చెప్పే కుర్రాడే దొరకడం లేదు !

-వీరేశ్వర రావు మూల

Also read: చర్విత చర్వణం

Also read: ఆంధ్రభూమి

Also read: డైన్ మైట్

వీరేశ్వర రావు మూల
వీరేశ్వర రావు మూల
సాహితి వివరాలు : 1985 నుంచి రాస్తున్నా. వివిధ పత్రికల్లో కధలు,కవితలు,కార్టూనులు వస్తున్నాయి. ఆంగ్లం లో కూడా వంద కి పైగా కవితలు వెబ్ పత్రికల్లో ప్రచురిత మయ్యాయి. వృత్తి : నిర్మాణ రంగం లో ఐటీ విభాగం మేనేజర్ ఉద్యోగం ఆంగ్లం లో Vibrations of my heart Amazon Kindle పుస్తకం గా ప్రచురణయ్యింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles