వసంతకం
తెలుగువారికి హాస్యం ఉగ్గుపాలతో అంటిన విద్య. పానుగంటివారి ‘‘రాధాకృష్ణ’’ ఏనాటి నాటకం. అందులో కావ్యోచితంగా హాస్యం పొంగే సన్నివేశం కవి ప్రతిభకి అద్దం పడుతుంది. వసంతకుడు కథానాయకుడు కూరిమి చెలికాడు. ఏదైనా అనగలడు, పడగలడు. ఒకచోట, ‘‘… ముద్దు ఆమెకొసంగి, ఉంగరము తాము ధరించి టుగాగమంబు మాత్రం దయతో నాకొసంగిరి స్వామీ’’ అంటూ వ్యాకరణ సూత్రంతో బాధపడతాడు. తెలుగు హాస్యంలో ఇదొక మచ్చుతునక! ముద్దు+ఉంగరము= ముద్దుటుంగరము.
‘‘కొంటెబొమ్మల బాపు’’
కొన్ని తరముల సేపు
గుండె వూయలలూపు
ఓ కోయిలమ్మ!