హాస్యం, నవరసాల్లో ఒకటి
నేడు మిగతా రసాలకంటే
ఎక్కువగా కోరుకోబడేది
యాంత్రిక జీవితంలో
పూర్తిగా మృగ్యమైంది.
మన మొహాల్లో నవ్వు
ఎప్పుడోగాని కనిపించడం లేదు.
సహజంగా జీవితంలో
ఉండాల్సిన దానికోసం
కృత్రిమంగా ప్రయత్నించి
వికృతాన్ని సృష్టించి
వికటాట్టహాసం చేస్తున్నాం
అంతరాంతరాల్లోని
అశాంతిని అస్థిరత్వాన్ని
హాస్యం పేరిట
కప్పెట్టే ప్రయత్నం చేస్తున్నాం.
నిజ జీవిత అనుభవాలతో
మన అధరాలపై సహజంగా
మల్లెలు మందారాల్లా
దరహాసాలు, మందహాసాలు
విరియాలని కోరుకుంటూ
వాటికోసం తెల్లటి మనసులు
సిద్ధం చేసుకుందాం.
Also read: “మనిషి”
Also read: “వారసత్వం”
Also read: “గాంధారి”
Also read: “పుస్తకం”
Also read: “చేతన”