——————————
పాబ్లో నెరుడా ( Pablo Neruda)—Chilean poet
Poem” You start dying slowly”
స్వేఛ్ఛాను వాదం :. సి. బి. సి. మోహన్
——————————–
ఎప్పుడైతే
— లోకాన్ని చుట్టి రావో
— పుస్తక పఠనం ఆపుతావో
— జీవన నాదాన్ని వినలేవో
— నిన్ను నువ్వు ప్రశంసించుకోవో
అప్పుడే ,
నువ్వు మృత్యువుకు దగ్గరవుతున్నట్లు లెక్క.
ఎప్పుడైతే
—నీ ఆత్మ గౌరవాన్ని హననం చేసుకుంటావో
— అవసరంలో నీకు అందించిన స్నేహ హస్తాన్ని అందుకోవో
అప్పుడే
నువ్వు మరణిస్తున్నావని గ్రహించు .
——- నీ అలవాట్లకు బానిసవైతే
రోజూ ఒకే మార్గంలో నడుస్తూ పోతే
నీ పధ్ధతులు మార్చుకోకపొతే
రకరకాల వర్ణాంబరాలు ధరించకపొతే
అపరిచితులతో మాట కలపకపొతే
నువ్వు అంపశయ్యపై నున్నట్లే అనుకో !
——– నీ గుండె లయ వేగం చేసేవీ
నీ కన్నుల్లో మెరుపులు మెరిపించేవీ
అయిన తీవ్ర ఆకాంక్షలను
వాటి చిక్కటి భావోద్వేగాలను
అనుభూతి చెందడానికి
నీ మనసు నిరాకరిస్తుందో
అప్పుడే నీవు చావుకు దగ్గరవుతున్నావని తెలుసుకో !!
——- అగమ్యగోచరమైన దానిలో
ప్రమాదాలకు సిధ్ధమవవో
కలలను సాకారం చేసుకోవడానికి
వాటి వెంట పడవో
జీవితంలో ఒక్కసారైనా
నీనుండి నీవు పారిపోటానికి
సిధ్ధపడవో
అప్పుడే నువ్వు లేవని గ్రహించు
నీ జీవితాన్ని ప్రేమించు
నిన్ను నువ్వు ప్రేమించుకో !!
Also read: ఓ…..మనిషీ!!
Also read: బంధన ఛేదిత – ఊర్వశి